BigTV English

Kiraak RP Warns to Allu Arjun: అల్లు అర్జున్.. గుర్తుపెట్టుకో.. నీ పతనం మొదలు అయ్యింది.. కిర్రాక్ ఆర్పీ వార్నింగ్!

Kiraak RP Warns to Allu Arjun: అల్లు అర్జున్.. గుర్తుపెట్టుకో.. నీ పతనం మొదలు అయ్యింది.. కిర్రాక్ ఆర్పీ వార్నింగ్!

Kiraak RP Warns to Allu Arjun: జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ, హీరో అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న వివాదానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. జనసేన గెలిచాక.. కిర్రాక్ ఆర్పీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అల్లు అర్జున్ పై మండిపడుతున్నాడు. ఎన్నికల ప్రచారంలో బన్నీ.. వైసీపీ నేత శిల్పారామాచంద్రరెడ్డి కి మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. అంతేకాకుండా వారి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించి వచ్చాడు.


అతను మంచి వాడు, మంచి స్నేహితుడు కాబట్టే తాను వెళ్లినట్లు బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలపై ఆర్పీ ఫైర్ అయ్యాడు. అంటే కుటుంబంలో ఉన్న మనిషి.. చిన్నతనం నుంచి నువ్వు చూసిన మనిషి పవన్ మంచివాడు కాదా.. ? ఆయన ను నువ్వు చిన్నతనం నుంచి చూస్తున్నావ్.. అలాంటింది ఆయనకు మద్దతుగా కాకుండా వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతను గెలిపించమని అడగడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మెగా అభిమానుల వలనే అల్లు అర్జున్ ఉన్నాడని అన్నాడు.

ఇక దీంతో అల్లు ఫ్యాన్స్.. ఆర్పీపై రెచ్చిపోయారు. ఆర్పీ కుటుంబాన్ని తిట్టిపోస్తూ.. హోటల్స్ పై దాడి చేసారు. తాజాగా ఈ దాడిపై కూడా ఆర్పీ మాట్లాడాడు. తాను ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశాడు. కుటుంబం జోలికి వస్తే తాను అస్సలు ఊరుకొనేది లేదని తెలిపాడు. “నేను మిమ్మల్ని విమర్శిస్తే..నన్ను ఏమైన చేసుకోండి.. ఇంట్లో ఆడవాళ్ల మీద పడొద్దు అని నేను అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి చెప్పాను.. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీకి చెప్తున్నా. అదే ప్రభుత్వంలా మీ ఆర్మీ ప్రవర్తిస్తుంది అల్లు అర్జున్ గారు.. అసలు మీకు ఆర్మీ ఉందా.. ? లేదా అన్న విషయం కూడా నాకు తెలియదు. అలానే ఆడోళ్ళ మీద పడిన ప్రభుత్వం పతనమైంది.


Also Read: RT 75 Officially Launched: ‘ధమాకా’ జోడి రిపీట్.. ఈ సారి దంచి కొట్టనున్న రవితేజ, శ్రీలీల..

గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ గారు.. ఇలాంటిది మీరు ప్రోత్సహిస్తున్నారు. మీరు చేస్తున్నారు కాబట్టే మీకు పతనం మొదలు కాబోతుంది. నేను ఎవరికి భయపడను, మీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాక్ ఆర్పీ. ఎవడి గుండె వాడికి ఉంటుంది.. ఎవడి ఫ్యామిలీ వాడికి ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా.. ఆరోజు మీరు చేసింది తప్పు. అది నిజమనుకుంటే నమ్మండి.. లేకపోతే ఒక గాడిద మాట్లాడిందని వదిలేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది. మీ ఇళ్లలో ఆడవారు లేరా.. ?

నేను ఇప్పటికీ చెప్తున్నా ఆర్మీ అంటే జన సైనికులు.. ఆర్మీ అంటే టీడీపీ నేతలు. ఎలాంటి స్వార్థం లేకుండా నిలబడ్డారు. ఎన్ని గొడవలు.. ఎన్ని పోలీస్ కేసులు.. ఇవన్నీ భరించారు. మీరు సినిమాలు చేసుకోండి.. పాన్ ఇండియా స్టార్ అవ్వు.. దేశానికి పేరు తీసుకురా.. మేము కూడా చూస్తాం. ఒక గొప్ప హీరో మీరు. మరి మీకు ఆర్మీ ఎక్కడ నుంచి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆర్పీ వ్యాఖ్యలుపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×