BigTV English

#RT75 Officially Launched: ‘ధమాకా’ జోడి రిపీట్.. ఈ సారి దంచి కొట్టనున్న రవితేజ, శ్రీలీల..!

#RT75 Officially Launched: ‘ధమాకా’ జోడి రిపీట్.. ఈ సారి దంచి కొట్టనున్న రవితేజ, శ్రీలీల..!

Ravi Teja – Srileela Combo Movie Started with Pooja Programs Today: మాస్ మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోతున్నాడు. గతేడాది ‘ధమాకా’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్‌గా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ ఏడాది మొదట్లో ‘ఈగల్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయింది.


దీంతో విజయపజయాలు చూడకుండా ముందుకు దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా. ఇందులో భాగంగానే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు కూడా ప్రేక్షకుల్లో సరికొత్త క్యూరియోసిటీని పెంచేశాయి. ఇక ఈ మూవీ తర్వాత మాస్ మహారాజా తన లైనప్‌లో మరో మూవీ ఉంచాడు.

ఇందులో భాగంగానే తన కెరీర్‌లో 75వ మూవీ చేస్తున్నాడు. ‘RT75’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ మూవీ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇవాళ (జూన్ 11) ‘RT 75’ మూవీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీలో కుర్రాళ్ల కళల రాణి యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.


Also Read: మిస్టర్ బచ్చన్ గా మాస్ మహారాజ్.. ఏంది సామీ ఈ మాస్ ర్యాగింగ్..

దీంతో అటు మాస్ మహారాజా ఫ్యాన్స్, ఇటు శ్రీలీల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘ధమాకా’ జోడీ రిపీట్ అయిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ల ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపింది. కాగా ఇందులో రవితేజ.. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

https://twitter.com/THEPANIPURI/status/1800460587706491175

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×