E-Paper
Advertisement

Jabardasth Comedian: లక్షల్లో నష్టం.. యూట్యూబ్ ఛానెల్ ను అమ్మేస్తున్న జబర్దస్త్ కమెడియన్?

Jabardasth Comedian: లక్షల్లో నష్టం.. యూట్యూబ్ ఛానెల్ ను అమ్మేస్తున్న జబర్దస్త్ కమెడియన్?
Advertisement

Jabardasth Comedian:సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని కొంతమంది సెలబ్రిటీలు గా మారితే.. మరి కొంతమంది సెలబ్రిటీలుగా మారిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.. అలాంటివారిలో జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించిన మహీధర్ (Mahidhar)కూడా ఒకరు. మహీధర్ సొంతంగా ‘మహీధర్ వైబ్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ని చాలా కాలంగా నడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా మహీధర్ “తన యూట్యూబ్ ఛానల్ ని అమ్మేస్తున్నాను.. ఎవరైనా కొనండి” అంటూ వీడియోని షేర్ చేయడం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటి గురించి చూద్దాం.

ఛానల్ అమ్ముతానంటున్న జబర్దస్త్ కమెడియన్..

మహీధర్ షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “ఇక మీదట యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఛానల్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ ఉండాలి అనుకుంటే మాత్రం మీ సపోర్టు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలల క్రితం నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాను. అయితే ఈ బిజినెస్ లో రూ .55 లక్షల పైగా లాస్ అయ్యాను. సుమారుగా రూ .65 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. కేవలం రూ .10 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది” అంటూ తెలిపారు.

బిజినెస్ లో భారీ నష్టం..

Advertisement

“నేను దాచుకున్న రూ .40 లక్షల రూపాయలు అందులోనే పెట్టాను. బయట నుంచి ఒక రూ.25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చుకున్నాను, దీంతో అప్పు తీర్చాల్సింది చాలా ఉంది. ఈ విషయాలను నా యూజర్స్ వరకు తీసుకురావాలనుకోలేదు. కానీ తప్పని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, అందరూ సపోర్ట్ చేయండి. నా ఛానల్ తో కానీ, నాతో కానీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సహాయం చేయడానికి ట్రై చేయండి.. అప్పుడైతేనే ఈ ఛానల్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఛానల్ అమ్మాలంటే.. కొనేవారు ఆ కండిషన్ పెట్టారు..

” నిజానికి నేను ఈ ఛానల్ ని అమ్మడానికి సిద్ధమయ్యాను.. కానీ వాళ్లు ఒక టర్మ్ అండ్ కండిషన్ పెట్టారు. అదే నన్ను ఈ వీడియో చేసేలా చేసింది. మొత్తం మీద 60 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యానని తెలిపారు. వాస్తవంగా ఈ విషయాన్ని అటు అభిమానులు, నన్ను ఫాలో అయ్యే వారి వరకు తీసుకురాకూడదనుకున్నాను. నేనే ఛానల్ అమ్మేసి ఏదైనా పని చేసి సంపాదించాలనుకున్నాను. పైగా నా ఛానెల్ కూడా మూవీస్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి ఛానల్స్ ని కొంటూ ఉంటారు. వాళ్లు కూడా వచ్చారు. ఒక్క సబ్స్క్రైబర్ కి రూ .4రూపాయలు చొప్పున ఇస్తామన్నారు, 10 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 40 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పారని” తెలిపారు.

Advertisement

ALSO READ:Big TV Kissik Talks: పీఆర్స్ పై దమ్ము శ్రీజ ఊహించని కామెంట్లు.. వారు చెప్పింది నిజమే!

ఆ కండిషన్ దెబ్బకు ఆడియన్స్ ముందుకు వచ్చిన మహీధర్..

అయితే వాళ్లు ఒక కండిషన్ పెట్టారు అది ఏమిటంటే.. గతంలో వాళ్లు ఇలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కొనగా.. ఆ యూట్యూబర్ ఆ ఛానల్ అమ్మేసిన తర్వాత మళ్లీ కొత్త ఛానల్ మొదలుపెట్టారని, ఆడియన్స్ అందరూ కూడా అటువైపుగా వెళ్లారు.. అందుకే నా దగ్గరికి వచ్చేసరికి వారు కండిషన్ పెట్టారు. ఒకవేళ ఈ ఛానల్ అమ్మేస్తే పూర్తిగా ఇకమీదట మరో ఛానెల్ చేయడానికి వీలు ఉండకుండా కండిషన్ పెట్టారని” మాట్లాడారు.. ముఖ్యంగా మూవీస్ రిలేటెడ్ గా ఏది మాట్లాడకూడదని చెప్పుకొచ్చారట. ఇక మీదట రివ్యూస్ కానీ మూవీస్ కి సంబంధించిన విషయాలని చేయకూడదని చెప్పారని తెలిపారు. యూట్యూబ్ కొనేవాళ్లు ఈ రూల్స్ పెట్టేసరికి తనకి అర్థం కాక ఈ వీడియో చేశానని తెలిపారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×