Big Stories

Realme Buds Air 6 Pro : రియల్ మీ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఇక సౌండ్ అదిరిపోద్ది!

Realme Buds Air 6 Pro : మ్యూజిక్ వినడం అంటే మీకు ఇష్టమా.. ఫోన్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారా? అయితే మీరు బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కచ్చితంగా యూజ్ చేయాలి. ఇయర్‌బడ్స్ మీకు సరికొత్త మ్యూజిక్ ఫీల్‌ను ఇస్తాయి. మీరు డీప్ బేస్‌‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఫోన్‌కు కనెక్ట్ చేసి సులభంగా కాల్ మాట్లాడొచ్చు. ఇష్టమైన గేమ్స్‌ను మంచి సౌండ్‌‌తో ప్లే చేయవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఇయర్‌బడ్స్ వినియోగించే వారి సంఖ్య అధికంగానే ఉంది. సెల్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరి చేవిలో ఇయర్‌బడ్స్ కనిపిస్తాయి.

- Advertisement -

ఈ క్రమంలోనే Realme తన కస్టమర్ల కోసం రెండు కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకురానుంది. కంపెనీ తన వినియోగదారుల కోసం తన అధికారిక వెబ్‌సైట్‌లో Realme Buds Air 6, Air 6 Proలను టీజ్ చేసింది. ఈ రెండు ఇయర్‌బడ్స్ కంపెనీ చైనా అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. Realme Buds Air 6 మూడు కలర్ ఆప్షన్స్‌లో ఉంటాయి.

- Advertisement -

Also Read : ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు!

Realme Buds Air 6
రియల్ మీ ఇయర్‌బడ్స్ Air 6 ఫీచర్ల విషయానికి వస్తే బడ్స్ ఎయిర్ 6ని కంపెనీ 12.4ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్‌తో పరిచయం చేసింది. ఈ బడ్స్ బయోనిక్ బ్యాక్ కేవిటీ డిజైన్‌తో తీసుకురాబడ్డాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సౌకర్యం ఈ బడ్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో 50 dB వరకు శబ్దాన్ని ఫిల్టర్ చేయవచ్చు.

AI నాయిస్ కాన్సిలేషన్‌తో 6 బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌లతో కంపెనీ ఈ బడ్స్ తీసుకువస్తుంది. కాలింగ్ సమయంలో వినియోగదారులు స్పష్టమైన వాయిస్‌లో మాట్లాడగలరని కంపెనీ పేర్కొంది. క్వైట్ గ్రీన్, ఫాంటసీ పర్పుల్, ఆరెంజ్‌ కలర్స్‌లో బడ్స్ కొనుగోలు చేయవచ్చు.

Alsso Read :  6000mAh బ్యాటరీతో ఐక్యూ ఫోన్.. మే 16న లాంచ్!

Realme Buds Air 6 Pro
కంపెనీ ఈ బడ్స్‌ను డ్యూయల్-యూనిట్ డిజైన్, 11mm వూఫర్, 6mm మైక్రో ట్వీటర్‌తో తీసుకువచ్చింది. 6 ప్రోని 4000Hz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్ కాన్సిలేషన్, అడాప్టివ్ సీన్-బేస్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌‌తో అప్‌గ్రేడ్ చేశారు. బడ్స్‌లో AI నాయిస్ కాన్సిలేషన్‌తో 6 మైక్రోఫోన్ సెటప్ ఉంది. ఇది కాకుండా బడ్స్ 55ms తక్కువ-లేటెన్సీ మోడ్‌తో వస్తాయి. గ్లేసియర్ సిల్వర్ లైట్, గెలాక్సీ టైటానియం షాడో అనే రెండు కలర్ ఆప్షన్‌లతో రియల్‌మే బడ్స్ ఎయిర్ 6 ప్రోని కంపెనీ తీసుకొచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News