BigTV English

Jacqueline Fernandez:దెబ్బకు జాక్వెలిన్ కెరియర్ ముగిసినట్టేనా.. ఏమైందంటే..?

Jacqueline Fernandez:దెబ్బకు జాక్వెలిన్ కెరియర్ ముగిసినట్టేనా.. ఏమైందంటే..?

Jacqueline Fernandez:జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez).. శ్రీలంక నటి అయిన ఈమె హిందీ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది.. ఇక అక్కడ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసిన జాక్వెలిన్ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో చాలామంది హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అటు బాక్స్ ఆఫీస్ వద్ద వరుస ఫ్లాప్స్ పడడంతో పాటు కేసులు కూడా చుట్టుముట్టడం వల్ల కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఈమె కెరియర్ పతనం అయిపోయిందనే చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి.


వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న జాక్వెలిన్.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈమధ్య అడపాదడపా సినిమాలు చేసినా.. అవి కూడా ప్రత్యేక పాటల వరకే ఆమె పాత్ర పరిమితమవుతోంది. దీంతో ఆమె కెరియర్ మళ్ళీ పుంజుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అటు గత ఏడాది కూడా పెద్దగా ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించలేదు. ఆ సినిమాలు కూడా ఈమెకు పెద్ద ఆఫర్లు తెచ్చిపెట్టే పరిస్థితి కూడా లేదు. ఆ కారణంగానే జాక్వెలిన్ ఈ ఏడాదిలో చేసే సినిమాలు ఎన్ని.. ఆమెకు దక్కే సక్సెస్ ఎన్ని అనే విషయంలో కూడా సందిగ్ధం ఏర్పడింది.సాధారణంగా ఒక హీరోయిన్ వరుసగా ఫెయిల్యూర్స్ ని చవిచూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె కెరియర్ పరంగా డౌన్ ఫాల్ మొదలవుతుంది అని అందరికీ తెలిసిందే కదా.. దాంతో ఈమె కెరియర్ కూడా ముగిసిపోతుందని అందరూ కామెంట్లు చేస్తున్నారు. మరి జాక్వెలిన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని, లేకపోతే కెరియర్ స్పాయిల్ అవుతుందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


కెరియర్ ముగిసినట్టేనా..?

కెరియర్ విషయానికి వస్తే.. 2009లో మోడలింగ్ తో కెరియర్ ను ఆరంభించిన ఈ అమ్మడు.. సుజోష్ ఘోష్ యొక్క ఫాంటసీ సినిమా ‘అలాడిన్’ కోసం మొదటిసారి ఆడిషన్స్ కి వెళ్ళింది. అక్కడ మొదలైన ఈమె ప్రస్థానం కంటిన్యూ అవుతూ వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. అదే సమయంలో ఎన్నో షోలలో కూడా కనిపించిన ఈమె.. బాలీవుడ్ కిక్ సినిమాతో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. 2014లో వచ్చిన ఈ సినిమా అటు జాక్వెలిన్ కి మంచి పేరు అందించింది. ఇక 2016లో హౌస్ ఫుల్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత కూడా పలు సినిమాలతో వరుస సక్సెస్ లు సొంతం చేసుకుంది. ఇక అలా ఒకప్పుడు వరుస సక్సెస్ లు చూసిన ఈమె.. గత నాలుగు ఐదు ఏళ్ళుగా పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతోంది. అటు స్పెషల్ సాంగ్స్ చేసినా కూడా పెద్దగా అవి ప్రతిఫలం ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మడికి సినిమాలలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. ఇక ముందు ముందు ఈమెకు ఐటమ్ సాంగ్స్ లోనూ ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా జాక్వెలిన్ మళ్లీ హీరోయిన్గా నటించి హిట్టు కొడితే తప్ప ఆమెకు కెరియర్ లేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×