BigTV English

Samantha : ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ సమంత.. అస్సలు ఊహించలేదు మామా..!

Samantha : ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ సమంత.. అస్సలు ఊహించలేదు మామా..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కేవలం వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తూ బిజీగా ఉంది. ఆమె తెలుగులో సినిమాలు ఆపేసి రెండేళ్లు పూర్తి అయ్యింది. చివరగా విజయ్ దేవరకొండ ( vijay Devarakonda) తో కలిసి ఖుషి మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కానీ బాలీవుడ్ లో కానీ సినిమాలు అనౌన్స్ చేయలేదు. కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తూ బిజీగా గడుపుతుంది.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సిరీస్ కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సమంత ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలను అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాకు నిర్మాతగా సమంతనే వ్యవహరిస్తుంది. అయితే ఆ సినిమా ప్రోగ్రెస్ ఏంటో తెలియదు కానీ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదని మాత్రమే తెలుస్తుంది. దీనికన్నా ముందు ఓ వెబ్ సిరీస్ ని సమంత చేయనున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘రక్ట్ బ్రహ్మాండ’ (Rakt Brahmand) అనే వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి ఇప్పుడు బ్రేక్ పడిందట. కారణం నిర్మాణం లో పెద్ద స్కాం జరిగిందని నెట్ ఫ్లిక్స్ సంస్థ అనుమానిస్తుందట.. అందుకే దీన్ని ఆపేసినట్లు సమాచారం.

Also Read : నిన్న సూపర్ స్టార్… నేడు రెబర్ స్టార్… డైరెక్టర్ సీరియస్ కండీషన్స్..!


గతేడాది సెప్టెంబర్ లో ఈ వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేశారు. 26 రోజుల షూటింగ్ ని మాత్రమే జరుపుకున్న ఈ వెబ్ సిరీస్, అప్పుడే 50 శాతం కి పైగా బడ్జెట్ ని దాటేసిందట. చాలా పెద్ద స్కాం జరిగిందని, దాని వెనుక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హస్తం ఉందని గుర్తించారట.. దాన్ని విచారణలో భాగంగా ఈ వెబ్ సిరీస్ ను ఆపేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్లే వెబ్ సిరీస్ ఆగిపోయింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ డి2ఆర్ నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ గా నటిస్తుందని తెలిసిందే. రాజ్ & డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.. ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ఉన్న వాటికి ఎంత ఖర్చు చెయ్యడానికైన వెనకాడదు. ప్రస్తుతం ఈ ఇష్యూ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఏది ఏమైనా సమంత వెబ్ సిరీస్ కు ఇలాంటి పరిస్థితి రావడం ఆమె ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.. ఇక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత లవ్ లో పడిందని చర్చించుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×