Storage Tips: ప్రతి ఇంట్లో పచ్చి మిర్చి, కొత్తిమీరను ఉపయోగిస్తాము. కొన్ని సార్లు ఇంట్లో ఎక్కువగా పచ్చి మిర్చి , కొత్తిమీర ఉన్నప్పుడు వాటిని నిల్వ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి. సరిగ్గా నిల్వ చేయకపోతే తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో డబ్బు కూడా వృధా అవుతుంది. కొన్ని సార్లు మనకు బయటకు వెళ్లే.. వీలు లేనప్పుడు నిల్వ చేస్తే.. వాటిని ఉపయోగించుకోవచ్చు.
ఇదిలా ఉంటే చాలా మంది మహిళలకు కొత్త మీర, పచ్చి మిర్చిని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి సింపుల్‌గా వీటిని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మిర్చి, కొత్తిమీర ఎండిపోయి లేదా కుళ్లి పోయి త్వరగా పాడై పోతాయని చాలా చెబుతుంటారు. ఈ సమస్యను నివారించడంలో కొన్ని చిట్కాలు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. వీటి సహాయంతో మీరు పచ్చి మిరపకాయలు, కొత్తిమీరలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.
పచ్చి మిర్చి, కొత్తిమీర నిల్వ చేసే పద్ధతులు:
కొత్తిమీర, పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిని ముందుగా కడిగి, తడి పోయే వరకు ఆరబెట్టండి. తర్వాత టిష్యూల్లో చుట్టండి. అనంతరం గాలి చొరబడని కంటైనర్ లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రిజ్‌లోని కూరగాయల సెక్షన్‌లో పెట్టండి. టిష్యూ కవర్ అదనపు తేమను గ్రహిస్తుంది. కాబట్టి కొత్తిమీర అయినా, పచ్చి మిర్చి అయినా త్వరగా కుళ్ళిపోవు. 10-15 రోజులు తాజాగా ఉంటాయి.
1. నీటిలో ముంచి నిల్వ చేయండి:
కొత్తిమీరను దాని వేర్లతో పాటు తాజాగా ఉంచడానికి పువ్వులను జాడీలో ఉంచినట్లుగా నీటితో నింపిన గాజు లేదా డబ్బాలో ఉంచండి. ఈ గ్లాసును ఫ్రిజ్‌లో ఉంచి ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి నీటిని మార్చండి. ఇది కొత్తిమీర తాజా దనాన్ని ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. కొత్తిమీరకు వేర్లు లేకపోతే.. కాండంను కత్తిరించి గాజు గ్లాస్‌లో నీరు నింపి అందులో పెట్టండి
2. అల్యూమినియం పాయిల్ (సిల్వర్ కవర్ )లో చుట్టండి:
కొత్తిమీర, పచ్చిమిరపకాయలను కడిగి ఎండబెట్టిన తర్వాత, వాటిని అల్యూమినియం పాయిల్లో బాగా చుట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. అల్యూమినియం పాయిల్ తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఆకులు 2 నుండి 3 వారాల పాటు తాజాగా ఉంటాయి. పచ్చి మిరపకాయలను కూడా ఇదే విధంగా నిల్వ చేయవచ్చు. కుళ్ళిపోకుండా లేదా ఎండిపోకుండా ఉండటంతో పాటు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే.. మీరు ఈ చిట్కాలు పాటించవచ్చు.
3. నూనె రాసి నిల్వ చేసుకోండి:
పచ్చిమిరపకాయలను కడిగి, బాగా ఆరబెట్టి కొద్దిగా ఆవాల నూనె రాసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఆవ నూనె మిరపకాయలు త్వరగా చెడిపోకుండా నిరోధించి, వాటిని తాజాగా ఉంచుతుంది. ఈ విధంగా చేస్తే పచ్చిమిర్చి 2-3 వారాల పాటు చెడిపోవు. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీరు మిరపకాయలను తాజాగా , ఎక్కువ కాలం ఉపయోగకరంగా ఉంచుకోవచ్చు.
4. ప్లాస్టిక్ లేదా జిప్ లాక్ బ్యాగులో నిల్వ చేయండి:
పచ్చి కొత్తిమీర, పచ్చి మిరపకాయలను జిప్ లాక్ బ్యాగులో వేసి దానిలో చిన్న రంధ్రాలు చేయండి. ఈ రంధ్రాలు బ్యాగ్ లోపల తగినంత గాలి ప్రవాహాన్ని అందిస్తాయి. తద్వారా తేమ సమతుల్యంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కొత్తిమీర, మిరపకాయలను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా 10-15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.
Also Read: ఉసిరి పొడిలో ఈ 3 కలిపి వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు !
5. టిష్యూ పేపర్ , గాలి చొరబడని కంటైనర్:
కడిగి ఆరబెట్టిన కొత్తిమీర ఆకులు, పచ్చిమిరపకాయలను గాలి వెళ్లని కంటైనర్‌లో ఉంచండి. కంటైనర్ పైభాగంలో , దిగువన టిష్యూ పేపర్‌ను వేయండి. టిష్యూ పేపర్ అదనపు తేమను పీల్చుకుని కూరగాయలు త్వరగా కుళ్ళిపోకుండా కాపాడుతుంది. ఈ పద్ధతి వేసవి కాలంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా కొత్తి మీర, పచ్చి మిరప కాయలు 2- 3 వారాల పాటు తాజాగా ఉంటాయి.