E-Paper
Advertisement

Simbaa Trailer: దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేదే ఎక్కువ..

Simbaa Trailer: దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేదే ఎక్కువ..
Advertisement

Simbaa Trailer: విలక్షణ నటుడు జగపతి బాబు, అనసూయ, గౌతమి, వసిష్ట సింహ, శ్రీనాథ్ మాగంటి, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సింబా. మురళి మనోహర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్టేజ్ ముందున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసే సెక్యూరిటీ వరకూ.. ఇక్కడున్న హంతకులందరికీ వార్మ్ డెత్ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ప్రపంచంలో దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేదే ఎక్కువమంది అని చెప్పడంతోనే.. ఈ సినిమా పర్యవరణాన్ని కాపాడండి అని చెప్పే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అని తెలుస్తోంది.

Advertisement

టీచర్ గా అనసూయ .. ప్రకృతి ప్రేమికుడిగా జగపతి బాబు కనిపించారు. ఇక పర్యావరణానికి హాని కలిగించే వారందరినీ టార్గెట్ చేసి అనసూయ, జగపతి బాబు చంపుతూ ఉంటారు. అందులోనూ హత్య చేసేది అనసూయకు తెలియకపోవడంతో.. ఆమె మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుందని డాక్టర్ గౌతమి చెప్పడం మరింత ఆసక్తిని కలిగించింది.

అనసూయ కావాలనే ఇదంతా చేస్తుందా.. ? జగపతి బాబుకు, అనసూయకు సంబంధం ఏంటి.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×