BigTV English

America: యూఎస్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గెలుపు కోసం ఏపీలో పూజలు

America: యూఎస్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గెలుపు కోసం ఏపీలో పూజలు

JD Vance: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. డెమోక్రాట్ల అభ్యర్థిగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో దిగనున్నట్టు తెలుస్తున్నది. ఇక రిపబ్లికన్ల అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. ఆయన ఉపాధ్యక్షుడిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఇప్పుడు ఈ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గెలవాలని ఆంధ్రప్రదేశ్‌లో పూజలు జరుగుతున్నాయి. జేడీ వాన్స్‌కు ఏపీకి సంబంధం ఏమిటనే కదా మీ డౌటు. జేడీ వాన్స్ ఆంధ్రప్రదేశ్ అల్లుడే. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరిది ఏపీకి చెందిన కుటుంబమే. ఇప్పటికే వారి ఊరిలో ఉషా కుటుంబానికి గౌరవం మెండుగా ఉన్నది. అందుకే ఉషా అమెరికా సెకండ్ లేడీ హోదా దక్కించుకోవాలని ఆంధ్రాలో పూజలు జరుగుతున్నాయి.


డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు తీసుకుంటారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడైతే ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీగా ఉంటారు. ఇదే జరిగితే అమెరికా సెకండ్ లేడీగా ఉషా తొలి నాన్ అమెరికన్‌గా రికార్డు సృష్టిస్తారు.

వీరిది ఏపీలోని ఉమ్మడి కృష్ణ జిల్లా వడ్లూరు అనే కుగ్రామం. తన తండ్రి చిలుకూరి రాధాక్రిష్ణన్ చెన్నైలో పెరిగారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. పీహెచ్‌డీ హోల్డర్ రాధాక్రిష్ణన్ ఇండియాకు తిరిగి వచ్చి దంపతులు అమెరికాకు తిరిగి వెళ్లారు. వీరికి ఉషా అమెరికాలోనే జన్మించారు. కాలిఫోర్నియా సబర్బన్ శాన్ డీగోలో పెరిగారు. యేల్ లా స్కూల్‌లో ఉషా వాన్స్‌ను కలుసుకున్నారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లల సంతానం.


రాధాక్రిష్ణన్ స్వగ్రామం వడ్లూరిలోని ఓ సాయిబాబా ఆలయంలో ఉషా గెలుపు కోసం పురోహితుడు సుబ్రమణ్య శర్మ రోజూ పూజలు చేస్తున్నారు. తాము ఉషాను ఆశీర్వదిస్తున్నామని, దేవుడి ఆశీస్సుల కోసం కూడా పూజలు చేస్తున్నామని వివరించారు. ఆమె తన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తామంతా ఇక్కడ ఉషా కోసం ఆమె భర్త కోసం ప్రత్యేక పూజలు చేపడుతున్నామని తెలిపారు. ఒకప్పుడు ఉషా కుటుంబ యాజమాన్యంలో ఉన్న బిల్డింగ్‌లోనే ఈ సాయి బాబా మందిరం ఉన్నది.

Also Read: మద్యం కుంభకోణం జరిగింది.. CBCID ఆధ్వర్యంలో ఎంక్వైరీకి సీఎం ఆదేశం

ఉషాకు బంధువైన ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ కూడా ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. 90లలో కూడా యాక్టివ్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న ఆమె గురించి ఇది వరకే ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్‌తో గతంలో సంబంధాలున్న శాంతమ్మ భర్త సోదరుడి మనవరాలే ఉషా. అమెరికాకు వలస వెళ్లి అక్కడే భారతీయులు స్థిరపడటాన్ని శాంతమ్మ వ్యతిరేకిస్తారు. ఉషా తన హోదా, లీగల్ నాలెడ్జ్‌ను ఉపయోగించి భారత మేధో వలసను ఆపాలని సూచించారు. భారతీయులు విద్య కోసం, శిక్షణ కోసం అమెరికా వెళ్లితే తప్పు లేదని, ఇవన్నీ చేయవచ్చని, కానీ, అన్నింటికి ఒక పరిమితి ఉంటుందని వివరించారు. అక్కడ వారు అనుకున్నంత కాలం ఉండి అయినా.. తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని తెలిపారు.

Related News

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

Big Stories

×