E-Paper
Advertisement

Update on War 2 Movi: ఎన్టీఆర్ నాన్నగా జగపతి బాబు.. క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో వైరల్!

Update on War 2 Movi: ఎన్టీఆర్ నాన్నగా జగపతి బాబు.. క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో వైరల్!
Advertisement
Ntr - War 2
Ntr – War 2

NTR’s War 2 Movie Update: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే టాలీవుడ్‌లో మాత్రమే క్రేజ్ ఉండేది. తన యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలవరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’తో తన కెరీర్ మరో రేంజ్‌కి వెళ్లింది. అప్పటి వరకు తెలుగులోనే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న తారఖ్ ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ఈ మూవీలో తన నటనకు గానూ ఎంతోమంది ప్రముఖులు సలాం కొట్టారు. దీంతో ఎన్టీఆర్‌కు పలు భాషల్లో నటించే అవకాశాలు దక్కాయి. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘వార్ 2’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా కనిపిస్తాడా? లేక విలన్‌గా కనిపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌ పాత్రకి తండ్రిగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు నటించబోతున్నట్లు వార్తలు కొద్ది రోజుల నుంచి జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై జగపతి బాబు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘వార్ 2’ మూవీలో ఎన్టీఆర్ పాత్రకి తండ్రిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అవి నిజమేనా? అని యాంకర్ అడగ్గా..

Also Read: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!

Advertisement

‘‘ ఈ రూమర్స్ నేను కూడా విన్నాను. కానీ నాకు వార్ 2 మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ప్రస్తుతం ఇది రూమర్ మాత్రమే’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో గత కొద్ది రోజుల నుంచి స్ప్రెడ్ అవుతున్న ఈ రూమర్స్‌కు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయింది. ఇకపోతే ఈ మూవీలో ఎన్టీఆర్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహం విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు.

ఈ మూవీతో పాటు తారఖ్ టాలీవుడ్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×