BigTV English

Court Dismisses Kejriwal petition: కేజ్రీవాల్‌కు మరో షాక్, ఇక సుప్రీంకోర్టుకు..

Court Dismisses Kejriwal petition: కేజ్రీవాల్‌కు మరో షాక్, ఇక సుప్రీంకోర్టుకు..
Court dismisses Delhi CM Kejriwal's plea seeking more time with lawyers
Delhi CM Arvind Kejriwal

Court Dismisses Delhi CM Kejriwal’s Petition: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన నిందితులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిందితులు పెట్టుకున్న రకరకాల పిటీషన్లను న్యాయస్థానం తోసిపుచ్చుతోంది. విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ గానీ, ప్రత్యేక సదుపాయాలు కల్పించలేమని చెప్పేసింది.


తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జైలులో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలని ఆయన రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారంలో ఇప్పుడిప్పుడు లీగల్ మీట్స్‌ని రెండు నుంచి ఐదుకు పెంచాలన్నది అందులోని ముఖ్యమైన పాయింట్. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.

మరోవైపు తనను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెల్లడించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసినట్టు ఆయన తరపు న్యాయవాది వివేక్ జైన్ తెలిపారు. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.


Also Read: Lok Sabha Elections 2024: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

ఈ కేసులో విషయంలో ఈడీ వద్ద ఆధారాలున్నాయని న్యాయస్థానం తెలిపింది. గోవా ఎన్నికల కోసం డబ్బు ఇచ్చినట్టు అప్రూవర్ చెప్పారని, సీఎం ఒక న్యాయం… సామాన్యులకు మరొక న్యాయం వుండదని తేల్చిచెప్పేసింది. మొత్తానికి సుప్రీంకోర్టులోనైనా కేజ్రీవాల్‌కు ఉపశమనం కలుగుతుందని ఆఫ్ నేతలు భావిస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×