E-Paper
Advertisement

Jani Master Case : ‘జానీ నాకు అన్నయ్య’.. బాధిత యువతి మాటలివి… కేసులో అసలు ట్విస్ట్ ఇదే..

Jani Master Case : ‘జానీ నాకు అన్నయ్య’.. బాధిత యువతి మాటలివి… కేసులో అసలు ట్విస్ట్ ఇదే..
Advertisement

Jani Master Case.. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేస్ కలకలం సృష్టిస్తోంది..రోజుకొక ఊహించని ట్విస్ట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 2017లో జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లతో తన టీమ్ లో చేరాలని ఫోన్ చేయించి మరీ అడిగారని, చేరిన తర్వాత 2019లో అవుట్డోర్ షూటింగ్లో భాగంగా ముంబైలోని ఒక హోటల్లో బస చేసినప్పుడు, లైంగికంగా తనపై దాడి చేశాడని, విషయం బయట పెడితే సినిమాలలో అవకాశాలు రాకుండా బెదిరిస్తున్నాడని, అలాగే పుష్ప సినిమా షూటింగ్ సెట్లో కూడా తనపై శారీరక దాడికి ప్రయత్నించాడు అంటూ బాధిత యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంతే కాదు మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడు అంటూ కామెంట్ చేయడంతో.. జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు కూడా విధించి , రెండు వారాలపాటు చంచల్గూడా జైలుకి రిమాండ్ కి తరలించారు పోలీసులు.

ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసిన జానీ మాస్టర్ భార్య..

Advertisement

ఇదిలా ఉండగా జానీ మాస్టర్ భార్య సుమలత తన భర్త అలాంటివాడు కాదని, బాధిత యువతి కావాలని తనపై కుట్రపన్ని ఇలా చేస్తోందని, తన భర్త ఎదుగుదలను జీర్ణించుకోలేక ఎవరో కావాలని వెనకుండి ఆమెను నడిపిస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు తాజాగా ఫిలిం ఛాంబర్ ను కలిసి గతంలో బాధిత యువతి తనతో మాట్లాడిన మాటలను కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి సుమలత ఫిలిం ఛాంబర్ లో ఇచ్చిన కంప్లైంట్ లో ఏ విషయాలు తెలియజేసిందో ఇప్పుడు చూద్దాం.

అన్నా – వదిన అంటూ నమ్మబలికింది..

Advertisement

సుమలత బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేస్తూ.. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను బాధిత యువతి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వేధింపులకు గురిచేసింది. 5 సంవత్సరాలగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లాను అంటే ఆమె ఎంత టార్చర్ చేసిందో దయచేసి మీరు అర్థం చేసుకోండి. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు , నన్ను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అంతేకాదు నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా కూడా అడ్డుకునేది. కేవలం మూడు గంటలు మాత్రమే నా ఇంటికి పంపేది. ఈ బాధ తట్టుకోలేక నేనే నేరుగా ఆమె ఇంటికి వెళ్లి.. నువ్వు జానీ మాస్టర్ ను ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పాను. అయితే దానికామే మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదిన అంటూ మమ్మల్ని నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామందితో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆమెను దూరం పెట్టేశాడు. దీంతో కక్ష కట్టి తనపై లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరు ఉన్న డబ్బున్న మగాడిని టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేస్తూ చిత్రవధకు గురిచేస్తోంది. బాధితురాలితో పాటు ఆమె తల్లి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా భర్తకే కాదు నాకు, నా పిల్లలకు ఏం జరిగినా సరే ఆ తల్లి కూతుర్లదే బాధ్యత. దయచేసి నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను అంటూ సుమలత వేడుకుంది. ప్రస్తుతం సుమలత బయటపెట్టిన ఈ నిజాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×