BigTV English

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Truck Drivers who cheated fruit traders: సాధారణంగా దొంగలు డబ్బులు, బంగారు, వెండి నగలు దోచుకెళ్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా ప్రమాదం జరిగిందని చెప్పి కొత్త రకం దొంగతనం చేయడం చర్చనీయాంశంగా మారింది. సిమ్లా నుంచి చెన్నైకి ఆపిల్ పండ్ల లోడ్ వెళ్తుంది. అయితే, ఈ లోడ్ మార్గమధ్యలో బోల్తా పడిందని, ప్రజలు పండ్లు ఎత్తుకెళ్లారని ఆ సంబంధిత ట్రక్కు డ్రైవర్లు పండ్ల వ్యాపారులను మోసం చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దుండుమల్కాపురంలో చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కొత్తపేట పండ్ల మార్కెట్‌ పండ్ల వ్యాపారి కందగొండ దత్తాత్రేయ.. ఈ నెల 17న సిమ్లాలో భువన్‌సింగ్‌ నుంచి రూ.15.32 లక్షలు విలువ చేసే 493 డబ్బాల ఆపిల్ పండ్లను కొనుగోలు చేశాడు. ఈ పండ్లను చెన్నైలో విక్రయించేందుకు కంటైయినర్‌ ట్రక్కు తీసుకున్నారు. పండ్లను రవాణా చేసేందుకు ట్రాన్సుపోర్టు కంపెనీకి రూ.1,32,200 చెల్లించాడు. అయితే కంటైనర్‌లో పండ్లను తీసుకొని బయలుదేరిన డ్రైవర్లు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే కొత్త రకం దొంగతనం చేసేందుకు ఆలోచించారు.

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురానికి ట్రక్కు చేరుకుంది. ఇంతలో ఆ డ్రైవర్లు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై దండుమల్కాపురం వద్ద ప్రమాదం జరిగిందని వెంటనే ఫోన్ చేసి వ్యాపారికి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో పండ్లు స్థానికులు ఎత్తుకెళ్లారని నాటకం ఆడారు. దీంతో పండ్ల వ్యాపారితో పాటు భువన్‌సింగ్‌ వచ్చి చూడగా కంటైనర్‌ ట్రక్కుకు ప్రమాదం జరిగినట్లు కనిపించలేదు. అయితే విషయం తెలుస్తుందని భావించిన ఇద్దరు డ్రైవర్లు అక్కడినుంచి పరారయ్యారు.


Also Read:  విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ఆగడాలు.. డబ్బు, విద్యార్థులతో కూడా

కాగా, పోలీసులకు జరిగిన సంఘటను వ్యాపారి వివరించారు. పండ్ల వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందన్నారు. త్వరలోనే ఆ ఇద్దరిని పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×