BigTV English

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Jani Master :  లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే లీగల్ గా పోరాడాలని డిసైడ్ అయిన ఆయనకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఉప్పరపల్లి లోని ఫోక్సో కోర్టు తాజాగా ఆయన రిమాండ్ కు సంబంధించిన కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలోనే ఆయనను అక్టోబర్ 3 వ తేదీ వరకు రిమాండ్ లఓ ఉంచానున్నారు. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి చెర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ న్యాయవాది ఆయనపై ఫోక్సో చట్టం నమోదైన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కు అప్లై చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అవుతుందా? లేదా అన్నది ఆసక్తకరంగా మారింది.


జానీ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

అయితే కోర్టు ఆవరణలో ఉన్నప్పుడే జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుట్రపూరితంగా కావాలని తనను ఇరికించారని ఆవేదనలను వ్యక్తం చేసిన జానీ కడిగిన ముత్యంలా నిజాయితీగా తాను బయటకు వస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనను ఇలా అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిన ఎవరిని వదిలి పెట్టబోను అంటూనే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా అని సినిమా స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు గోవా నుంచి హైదరాబాద్ కు జానీ మాస్టర్ ను తీసుకొచ్చారు నార్సింగ్ పోలీసులు. ఆ తర్వాత సిటీలోని ఓ సీక్రెట్ ప్లేస్ లో అతన్ని విచారించి, అనంతరం ఉప్పర పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో నిందితుడైన జానీ మాస్టర్ పై ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి టైంలో ఆయనకసలు బెయిల్ దొరుకుతుందా అనేది చూడాలి.


Jani Master : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్ట‌ర్‌కు షాక్‌.. 14 రోజుల  జ్యుడిషియ‌ల్ రిమాండ్‌ | Judicial remand for johnny master for 14days-10TV  Telugu

జానీ వెర్షన్ ఏంటి?

ఈ వివాదంలో ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు జానీ మాస్టర్ వెర్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కొంతమంది. తాజాగా జరిగిన మీడియా మీట్ లో జానీ మాస్టర్ భార్య ఆయేషా మాట్లాడుతూ ఆయనపై కంప్లయింట్ చేసిన బాధితురాలిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ కు శిక్ష పడాలంటూ గోల చేస్తున్న మహిళా సంఘాలను ప్రూఫ్ ఏంటి అంటూ నిలదీసింది. అంతేకాకుండా అంత హింస పెడితే ఇన్నాళ్ళూ జానీ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉంది? ఆమె చెప్పేది తప్ప నిజానిజాలు ఏంటో తెలుసుకోరా ? అంటూ ఫైర్ అయ్యింది. మరి జానీ మాస్టర్ వెర్షన్ ఏంటో, అది ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×