BigTV English

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏం తేల్చింది? కమిషన్‌ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇంకా విచారణ ఎన్నిరోజులు పట్టే అవకాశముంది? ప్రస్తుతం బహిరంగ విచారణ జరుగుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ మొదలుపెట్టింది. తొలిరోజు శుక్రవారం ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు, రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు హాజరయ్యారు.

మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్య, ఆ తర్వాత మోడల్స్ చేపట్టినట్టు తెలిపారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందు నిర్మాణం మొదలైనట్టు అంగీకరించారు. ప్రాజెక్టు డ్యామేజ్ వెనుక నీళ్లను స్టోరేజ్ చేయడమే కారణమని ప్రస్తావించారు.


ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులునిర్లక్ష్యం వహించడమే దీనికి కారణంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మోడల్ స్టడీస్ తర్వాత పలు రకాల మార్పులు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారట. నీటిని స్టోరేజ్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారని గుచ్చిగుచ్చి ప్రశ్నించింది కమిషన్. నిబంధనల ప్రకారమే పని చేశామని ఇంజనీర్లు అన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ చేసినట్టు రీసెర్చ్ ఇంజనీర్లు తెలిపారట. కమిషన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారులు తడబడినట్లు అంతర్గత సమాచారం. దానికి సంబంధించి కొన్ని డీటేల్స్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఒకొక్కరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గత నెలలో 15 మందిని విచారించింది కమిషన్, అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిపై కమిషన్ విచారణ జరుపుతోంది.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×