E-Paper
Advertisement

Jani Master: ఢీ లో జరిగిన మోసం.. తట్టుకోలేక ఏడ్చేసిన జానీ మాస్టర్

Jani Master: ఢీ లో జరిగిన మోసం.. తట్టుకోలేక ఏడ్చేసిన జానీ మాస్టర్
Advertisement

Jani Master: టాలీవుడ్ లో సార్ బెస్ట్ కొరియోగ్రాఫర్ల లిస్ట్ లో జానీ మాస్టర్ పేరు టాప్ 5 లో ఉంటుంది. ఒక సాధారణమైన కంటెస్టెంట్ గా డ్యాన్స్ షోలో పాల్గొని.. ఎన్నో అవమానాలను భరించి డ్యాన్స్ మాస్టర్ గా మారాడు. తన స్టెప్స్ తో స్టార్ హీరోలను మెప్పించి స్టార్ కొరియోగ్రాఫర్ గా మారాడు. అంతేకాకుండా ఈ మధ్య రన్నర్ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇక సినిమాలు కాకుండా .. గత కొన్నేళ్లుగా జానీ మాస్టర్ ఢీ అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ అనే థీమ్ తో నడుస్తోంది. ఇందులో కొంతమంది సినీ, సీరియల్స్ లో ఉండే నటులు డ్యాన్స్ తో తమలోని మరో టాలెంట్ ను బయటపెడుతున్నారు. డ్యాన్స్ షూ అంటే ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. ప్రతి వారం ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటారు. తాజాగా ఎలిమినేషన్ రౌండ్ లో జరిగిన ఒక సంఘటన.. జానీ మాస్టర్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ వారం టాప్ బాటమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ సాత్విక్, సునంద ఉన్నారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ ఓటు వేసి.. ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇక అలా జరుగుతున్న క్రమంలో నారప్ప సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి పేరు తెచ్చుకున్న రాకీ.. సాత్విక్ కు సారీ చెప్పి సునందకు ఓటు వేస్తాడు.

Advertisement

ఇక వెంటనే జానీ మాస్టర్ కలుగజేసుకొని.. ఈ స్టేజి ఎంతో గొప్పది.. ఒక జీవితం.. మీరు వేసే ఒక ఓటు వారి లైఫ్ ను కాపాడుతుంది.. ఖచ్చితమైన రీజన్ చెప్పి ఎలిమినేట్ చేయండి అనగానే.. రాకీ లేచి.. సాత్విక్ అన్న కళ్లతో సైగలు చేసి.. సునంద అక్కకు ఓటు వేయమని చెప్పాడు. అందుకే వేశాను అని చెప్పగానే జానీ మాస్టర్ .. ఇది మోసం కాదా..? మేము ఇక్కడ ఉన్నది ఎందుకు.. ? అంటూ ఫైర్ అయ్యాడు. ఎర్రిపప్పలా కనిపిస్తున్నామా.. ? అని సెట్ నుంచి వెళ్ళిపోయాడు. ఎవడో సైగ చేశాడు అంట.. వీడు ఇచ్చాడు అంట.. ఢీ షో ఎలా కనిపిస్తుంది మీకు.. ఒక్కొక్కడు లైఫ్ ఇది.. ఏదైనా మిస్ అయితే.. ఢీ అంటే ఆటలుగా అనిపిస్తుందా.. ? అంటూ కోపంతో ఊగిపోయాడు. మైక్ ను పగులకొట్టి సెట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×