BigTV English

Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చకుల వేషధారణలో పోలీసులు

Kashi Vishwanath Temple: వివాదంలో యోగి సర్కార్.. అర్చకుల వేషధారణలో పోలీసులు

UP Police in Priests Attire(Latest today news in India): యూపీలోని యోగి సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు కొత్తరకం యూనిఫాం ధరించారు. వారి సాధారణ యూనిఫాం కాకుండా అర్చకులు వేషధారణలో వస్త్రాలు ధరించి విధులు నిర్వహించారు. దీంతో సమాజ్ వాద్ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఖండించారు.


ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు ధోతి కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు. అయితే దీన్ని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు వారి యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడానికి అనుమతి ఇవ్వడం.. భద్రతకు పెను ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు.

పోలీసులు పూజారులు వేషం వేయడం ఏ పోలీస్ మాన్యువల్ ప్రకారం సరైనదని ప్రశ్నించారు. మోసగాళ్లు దీన్ని ఆశరాగా తీసుకుని అమాయకపు ప్రజలను మోసం చేస్తే ఏం చేస్తారని పలు అనుమానాలను లేవనెత్తారు. యూపీ ప్రభుత్వం, పాలనా యంత్రాంగం దీనిపై ఏం సమాధానం చెబుతుందని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆదేశాలు ఇచ్చే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


కాగా, యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారణాసి పోలీస్ కమిషన్ మెహిత్ అగర్వాల్ సమర్థించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఆలయాల్లో విధును నిర్వర్తించే పోలీసుల విధులు వేరుగా ఉంటాయని తెలిపారు.

Also Read: జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

ఆలయాల్లో భారీగా భక్తులు ఉంటారని.. వారిని పోలీసులు నెడితే మరోలా భావిస్తారని, అదే పూజారులు చేస్తే సానుకూలంగా స్వీకరిస్తారని అన్నారు. భక్తుల కోసం మాత్రమే పోలీసులు అర్చకుల వేషధారణలో మోహరించినట్లు వెల్లడించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×