E-Paper
Advertisement

Jani Master : జానీ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన కోర్టు… కస్టడీకి గ్రీన్ సిగ్నల్

Jani Master : జానీ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన కోర్టు… కస్టడీకి గ్రీన్ సిగ్నల్
Advertisement

Jani Master : పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా అరుదైన గుర్తింపును సంపాదించుకున్న జానీ మాస్టర్ ఇటీవలే రేప్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ కేసు పెట్టిన కేసు తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు ఝలక్ ఇచ్చింది.

జానీ మాస్టర్ కస్టడీకి గ్రీన్ సిగ్నల్…

Advertisement

జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడంటూ ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు టాలీవుడ్ ను షేక్ చేసింది. అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జానీ మాస్టర్ కేసు నుంచి తప్పించుకోవడానికి పరారీ కాగా, గోవాలోని ఓ రిసార్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతనికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాజాగా జానీ మాస్టర్ ను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టుకు బదిలీ చేశాక ఈ పిటిషన్ వేశారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే పలు కీలక విషయాలు తెలుస్తాయని పోలీసులు వేసిన పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు అతన్ని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జానీ మాస్టర్ ను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నార్సింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ వెయ్యగా, ఆయనను నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Jani Master | గోవా నుంచి హైదరాబాద్‌కు జానీ మాస్టర్..-Namasthe Telangana

Advertisement

బెయిల్ విచారణ వాయిదా 

తాజాగా జానీ మాస్టర్ కు ఈ అత్యాచారం కేసులో కోర్టు పోలీసుల కస్టడీకి గ్రీన్ ఇవ్వడంతో ఎదురుదెబ్బ తగిలినట్టుగా అయ్యింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ చేసిన బెయిల్ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. మరి జానీ మాస్టర్ కు బెయిల్ దొరుకుతుందా? కస్టడీకి తీసుకోబోతున్న నార్సింగ్ పోలీసులు అతని నుంచి రాబట్టబోయే విషయాలు ఏంటి? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ క్రమంలో జైలుకు వెళ్ళే ముందు న్యాయపరంగా పోరాడతాను అంటూ కామెంట్స్ చేసిన జానీ ఇప్పుడు పోలీసుల విచారణలో ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేషా బాధితురాలు ఆమె తల్లీ కలిసి తన భర్తను మోసం చేశారని ఆరోపిస్తోంది. ఇదొక హనీ ట్రాప్ అంటూ తన భర్తను వెనకేసుకొస్తోంది. మరి ఈ అత్యాచార కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×