BigTV English

Jani Master : ఇక్కడ ఇంత రచ్చ జరిగితే… నిన్న ముంబైలో ఏం పట్టనట్టు ఏం చేశాడో తెలుసా..?

Jani Master : ఇక్కడ ఇంత రచ్చ జరిగితే… నిన్న ముంబైలో ఏం పట్టనట్టు ఏం చేశాడో తెలుసా..?

Jani Master : ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా… వినిపించేది ఒక్కటే పేరు… అదే జానీ మాస్టర్. తనపై లైంగిక వేధింపులు చేశాడు అంటూ తన అసిస్టెంట్ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన నాటి నుంచి జానీ మాస్టర్ పేరు ఇటు న్యూస్ ఛానల్స్, అటు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సెలబ్రిటీలు దీనిపై స్పందిస్తున్నారు. ఏకంగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించాడు. బాధిత యువతికి పర్సనల్ గా కాల్ చేసి మరీ సానుభూతి ప్రకటించాడు బన్నీ. ఇంతలా రచ్చ జరిగితే, జానీ మాస్టర్ ఇవేవీ పట్టనట్టు ముంబైలో ఉన్నారట. ఆయన అక్కడ ఏం చేశారో ఇప్పుడు చూద్ధాం…


జానీ మాస్టర్ కొద్ది రోజుల ముందు వరకు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. కానీ, ఇప్పుడు ఓ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు. మొన్నటి వరకు మంచి డ్యాన్స్ మాస్టర్ అని పిలిపించుకున్న ఆయన, ఇప్పుడు మాస్టర్ అని పిలిపించుకోవడానికే అర్హత లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే బాధిత యువతికి వైద్య పరిక్షలు చేశారు పోలీసులు. అలాగే జానీ మాస్టర్ పై నార్సింగీ పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ముందుగా జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయనపై పోక్సో కేసును నమోదు చేశారు.

ఇంత రచ్చ జరిగితే మంగళవారం ఏం చేశారంటే..?


ఈ రోజు పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు అంటే… గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఎంత రచ్చ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉంటే జానీ మాస్టర్ మాత్రం ముంబైలో ఇవేవీ పట్టనట్టు ఉన్నారట. ఆయన ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీకి కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. మంగళవారం కూడా ముంబైలో ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారట. మంగళవారం షెడ్యూల్ పూర్తి అయిన తర్వాతే నెల్లూరుకి వచ్చినట్టు సమాచారం. ఈ విషయం బయట తెలియడంతో, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ఇంకా ఛాన్స్ లు ఎవరు ఇస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

అరెస్ట్ కి సర్వం సిద్ధం.. 

అయితే, ఈ రోజు (బుధవారం) ఉదయం జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ అయితే లేదు కానీ,  బాధితరాలి నుంచి పోలీసులు మరింత సమాచారం, సాక్ష్యాధారాలు తీసుకున్నారు. అలాగే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగే జానీ మాస్టర్ పై ఉన్న కేసును పోక్సో కేసులా ఛేంజ్ చేశారు. దీంతో ఏ క్షణం అయినా, జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

బాధితురాలికి పెరుగుతున్న మద్దతు… 

బాధితురాలికి ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా కూడా మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే బాధిత యువతికి అల్లు అర్జున్ పర్సనల్ గా ఫోన్ చేసి మరీ తన మద్దతు ప్రకటించాడు. అలాగే అనసూయ, పూనమ్ కౌర్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×