BigTV English

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Bigg Boss 11 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ షో కంటే ఎక్కువగా షోకు పోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషనే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషలకు సంబంధించిన బిగ్ బాస్ హోస్ట్ లు కోట్లలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక త్వరలోనే స్టార్ట్ కాబోతున్న కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కూడా వీరి బాటలోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.


కన్నడ హోస్ట్ కు భారీ రెమ్యూనరేషన్

కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 మరో 10 రోజుల్లో మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 29 నుంచి 11వ సీజన్ మొదలు కాబోతుందని రీసెంట్ గా ప్రోమో ను రిలీజ్ చేసి వెల్లడించారు. అయితే ఈసారి బిగ్ బాస్ షోకు పోస్ట్ గా ఎప్పటిలాగే కిచ్చా సుదీప్ రాబోతున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 కి హోస్టుగా వ్యవహరిస్తున్న సుదీప్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ కన్నడ తో సుదీప్ అనుబంధం 2015లో మొదలైంది. అయితే గత ఐదు సీజన్లకు సుదీపే హోస్ట్ గా వ్యవరించగా, 20 కోట్లకు ఆ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడని  టాక్ నడుస్తోంది. అంటే ఒక్కో సీజన్ కు నాలుగు కోట్లు పారితోషకంగా తీసుకున్నాడని సమాచారం. కానీ ప్రస్తుతం సుదీప్ తాజా సీజన్ కు భారీగా రెమ్యూనరేషన్ ను పెంచేసి, ఏకంగా 100 కోట్ల పారితోషికంగా తీసుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.


Bigg Boss Kannada 10: Unity prevails as host Kiccha Sudeep dissolves the  division between Samartharu and Asamartharu - Times of India

బిగ్ బాస్ హోస్ట్ అంటే నక్కతోక తొక్కినట్టే 

బిగ్ బాస్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరోలకు భాషతో సంబంధం లేకుండా ఏకంగా ఓ భారీ సినిమాకు ఖర్చు పెట్టేటంత రెమ్యూనరేషన్ అందుతుండడం విశేషం. హీరోలు చేసే సినిమాల సంగతి పక్కన పెడితే మిగతా కార్యక్రమాలు యాడ్స్ తోనే కోట్లకు కోట్లు కొల్లగొడుతుంటారు. ఇక బిగ్ బాస్ అంటే 3 నెలల పాటు ప్రతి వీకెండ్ వచ్చి గంటల తరబడి హోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగానే తమ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు హీరోలు. తెలుగులో నాగార్జున ఈ సీజన్ కి ఏకంగా 40 కోట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు అనే రూమర్లు వినిపిస్తుండగా, మరోవైపు హిందీ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ వందల కోట్లు తన ఖాతాలో వేసుకొనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. హిందీలో సీజన్ 18కు కూడా సల్మాన్ హోస్ట్ గా చేయనున్నారు. ఆయన 14 వారాలకు గానూ మొత్తంగా 350 కోట్లు పారితోషం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

Related News

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 : 2 టాస్క్ లతో స్కోర్స్ తారుమారు, నాశనం చేసిన రీతు, సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిన ఆ ముగ్గురు

Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?

Big Stories

×