E-Paper
Advertisement

Priyanka Mohan: విడాకులు తీసుకున్న స్టార్ హీరోతో సీక్రెట్ గా ప్రియాంక మోహన్ ఎంగేజ్మెంట్?

Priyanka Mohan: విడాకులు తీసుకున్న స్టార్ హీరోతో సీక్రెట్ గా ప్రియాంక మోహన్ ఎంగేజ్మెంట్?
Advertisement

Priyanka Mohan:గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. తెలుగు కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాలు చేసి మెప్పించిన ప్రియాంక.. ఈ మధ్యనే సరిపోదా శనివారం సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. అంతేకాకుండా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన  OG లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే  రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ప్రియాంక మోహన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అది కూడా ఈ మధ్యనే విడాకులు తీసుకున్న స్టార్ హీరో జయం రవితో ఆమె నిశ్చితార్థం గోవాలో చాలా సింపుల్ గా జరిగిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక దానికి రుజువుగా వారిద్దరూ దండలు మార్చుకున్న ఫోటోను షేర్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక మోహన్ ను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. నీకు ఇంకెవరు దొరకలేదా.. ?  అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటి.. ? అని కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

ఇంకోపక్క  జయం రవిపై కూడా ఫ్యాన్స్  విరుచుకుపడుతున్నారు. ఈ మధ్యనే జయం రవి.. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆమె  మాత్రం తన భర్త తన ప్రమేయం లేకుండా విడాకులు ప్రకటించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ  ఎంగేజ్మెంట్ నిజం కాదు. జయం రవి, ప్రియాంక మోహన్ కలిసి బ్రదర్ అనే మూవీ చేస్తున్నారు. అందులో భాగంగా జరిగిన ఒక సాంగ్ షూట్ లో ఫోటోను ఇలా షేర్ చేసి.. ప్రియాంక ఎంగేజ్మెంట్ అని చెప్పుకొస్తున్నట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది.

Advertisement

ప్రస్తుతం ప్రియాంక మోహన్.. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిందని, అక్కడ  ఆమె ఒక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని తెలుస్తోంది. ఇకపోతే బ్రదర్ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఏడాది సరిపోదా శనివారం తో హిట్ ఖాతా  తెరిచిన ప్రియాంక  మోహన్.. బ్రదర్ తో  ఇంకో హిట్ ను అందుకుంటుందో లేదో  చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×