BigTV English
Advertisement

Indian 3 : డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇండియన్3 మూవీ .. ఇదేం ట్విస్ట్ మామా..

Indian 3 : డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇండియన్3 మూవీ .. ఇదేం ట్విస్ట్ మామా..

Indian 3 : తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి అభిమానుల మనసు దోచుకున్న నటుడు ఎవరంటే కమల్ హాసన్ పేరే అందరికీ గుర్తుకు వస్తుంది. ఈయన సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాయా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. కమల్ హాసన్ ఇటీవల భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. ఇక కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చాయి. దాంతో సినిమా పరిస్థితి పరిస్థితి దారుణం మారింది. ఇప్పుడు ఇండియన్ 3 రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలు పెట్టేశారనే వార్తలు ఇటీవల వినిపించాయి. ఇక తాజాగా శంకర్, కమల్ హాసన్ మధ్య గొడవలు జరిగాయని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా విడుదల పై మరో వార్త చక్కర్లు కొడుతుంది.


భారతీయుడు సినిమా సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమాను శంకర్ తెరకెక్కించారు. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయింది. యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 3 తెరకెక్కించారు శంకర్. ఇండియన్ 2 సినిమా ఎఫెక్ట్ ఇండియన్ 3 సినిమా పై పడిందని చెప్పాలి. దానికోసమే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారని మొన్నటివరకు టాక్ వినిపించింది. తాజాగా ఓటీటీ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇండియన్ 3 పై బజ్ ఏ మాత్రం లేదు. బిజినెస్ జరగడం కూడా కష్టంగానే మారినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ 3కి సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. కమల్‌హాసన్‌, శంకర్ కాంబోకు ఉన్న క్రేజ్ కారణంగా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం..

ఇండియన్ 3 మూవీని జనవరి 2025 లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన అధికారికంగా ప్రకటించారు.. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో అనేది అనౌన్స్ చెయ్యలేదు .. కానీ ఓటీటీ లోకి డైరెక్ట్ గా రాబోతున్నట్లు మాత్రమే ప్రకటించారు. ఇండియన్ 3లో కమల్‌హసన్‌, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఇండియన్ 2 రిలీజైన థియేటర్లలో క్లైమాక్స్‌లో ఇండియన్ 3 టీజర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఇకపోతే ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చెయ్యడానికి కారణం శంకర్, కమల్ హాసన్ మధ్య గొడవలు కారణం అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియన్ 2 సినిమా వల్ల జరిగిన నష్టం వల్లే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి అక్కడైనా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.. ఇండియన్ 2 తర్వాత రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోన్నాడు శంకర్‌. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..


Related News

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : టెంపుల్‌లో కోనేరు మిస్టరీ… ఆ వాటర్ తాగితే పరలోకానికే… కనిపెట్టిన డాక్టర్‌కు బుర్రబద్దలయ్యే షాక్

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Big Stories

×