E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: మరోసారి రౌడీయిజం చూపించిన పృథ్వి.. అప్పుడు యష్మీ, ఇప్పుడు అభయ్.. ఏం మారలేదుగా!

Bigg Boss 8 Telugu Promo: మరోసారి రౌడీయిజం చూపించిన పృథ్వి.. అప్పుడు యష్మీ, ఇప్పుడు అభయ్.. ఏం మారలేదుగా!
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ అంతా ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉన్నా నామినేషన్స్ వచ్చేసరికి అందరి మధ్య ఉన్న మనస్పర్థలు బయటపడతాయి. కానీ నామినేషన్స్ గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే గేమ్‌లో ముందుకు వెళ్లడం కష్టం. ఆ విషయం యష్మీకి ఇంకా అర్థం కావడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. బిగ్ బాస్ 8లో జరిగిన మునుపటి నామినేషన్స్‌లో యష్మీ చీఫ్‌గా ఉండడంతో తను నామినేట్ అవ్వకుండా సేవ్ అయ్యింది. కానీ మూడోవారంలో మొదటిసారి నామినేట్ అవ్వగా అది పర్సనల్‌గా తీసుకొని తనను నామినేట్ చేసినవారిని పూర్తిగా దూరం పెట్టాలని చూస్తోంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

యష్మీకి కోపమొచ్చింది

Advertisement

మణికంఠ.. యష్మీతో క్లోజ్‌గా ఉంటూనే తనలోని నెగిటివ్స్‌ను చెప్పి నామినేట్ చేశాడు. గేమ్‌ను, ఫ్రెండ్‌షిప్‌ను కలిపి చూడొద్దని అన్నాడు. అయినా యష్మీ వినకుండా మణికంఠ వచ్చి హగ్ చేసుకున్నా కూడా కోపంగా వదిలేయమంటూ తనను పక్కనపెట్టింది. తర్వాత తనే ఒంటరిగా కూర్చొని ‘‘ప్లీజ్ బిగ్ బాస్ నా వల్ల అవ్వడం లేదు. నాకు చాలా కోపమొస్తుంది’’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పృథ్విరాజ్‌తో కూడా ఇదే విషయం గురించి మాట్లాడింది. ‘‘అది మెంటల్ టార్చర్‌. వచ్చి హగ్ చేసుకుంటున్నాడు. నాకు ఇబ్బందిగా ఉందని చెప్తున్నా వినట్లేదు. నిజంగానే తను ఫేక్ అనిపిస్తుంది. నేను హౌజ్‌లో ఉన్నంతవరకు ప్రతీ నామినేషన్‌లో తన పేరు చెప్తాను’’ అంటూ మణికంఠపై పగ పెట్టేసుకుంది యష్మీ.

Also Read: పెద్ద మనసుతో సెల్ఫ్ నామినేట్ చేసుకున్న చీఫ్.. నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్

Advertisement

ఫోటో పెట్టు ఆగేటట్టు

ఆ తర్వాత రేషన్ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ఈవారం రేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన మొదటి ఛాలెంజ్ ‘ఫోటో పెట్టు ఆగేటట్టు’. ఈ టాస్క్‌లో అభయ్, నిఖిల్ టీమ్స్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారి చీఫ్ ఫోటోలను బోర్డ్‌కు అతికించడంతో పాటు అవతలి టీమ్ పెట్టిన ఫోటోలను తీసేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కోసం అభయ్ టీమ్ నుండి నబీల్, నిఖిల్ టీమ్ నుండి పృథ్విరాజ్ ముందుకొచ్చారు. సంచాలకురాలిగా సీత వ్యవహరించింది. టాస్క్ అనగానే విచక్షణ మర్చిపోయి ఆడే పృథ్వి మరోసారి అదే పనిచేస్తూ రౌడీయిజం చూపించాడు. ఈ టాస్కులో నబీల్, పృథ్వి మధ్య గట్టి పోటీ జరిగినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

అభయ్ గొడవ

నబీల్, పృథ్వి ఒకరిపై ఒకరు పడి గొడవపడుతున్నప్పుడు సంచాలకురాలిగా సీత.. గేమ్‌ను ఆపమని చెప్పినా కూడా వారు వినకుండా అలాగే చేశారు. దీంతో చీఫ్‌గా అభయ్‌కు కోపం వచ్చి అరవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ప్రేక్షకులు.. యష్మీ స్థానంలోకి అభయ్ వచ్చినట్టు ఉందని, ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో టీమ్ సభ్యులు ఏం చేసినా సైలెంట్‌గా చూస్తున్నాడని అనుకుంటున్నారు. టాస్క్ అయిపోయిన తర్వాత అసలు తన స్ట్రాటజీ ఏంటో మణికంఠతో షేర్ చేసుకున్నాడు నబీల్. ఎంత చెప్పినా పృథ్వి పట్టుకోవడం, తోయడం లాంటివి చేయడం తనకు మైనస్ అని విష్ణుప్రియా ఇతర హౌజ్‌మేట్స్‌తో చర్చించింది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×