BigTV English

Over Walking Side Effects: ఎక్కువగా నడుస్తున్నారా ? జాగ్రత్త, ఈ 3 సమస్యలు తప్పవు

Over Walking Side Effects: ఎక్కువగా నడుస్తున్నారా ? జాగ్రత్త, ఈ 3 సమస్యలు తప్పవు

Over Walking Side Effects: నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తరుచుగా వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా బీపీ, షుగర్ వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి. కానీ ఎక్కువగా నడిచినా కూడా ప్రమాదమని మీలో ఎంతమందికి తెలుసు ? అవును నిజమే ఆరోగ్యంగా ఉంటామని ఎక్కువగా నడిచినా కూడా అనేక సమస్యలు వస్తాయి.


 ఓవర్ వాకింగ్ వల్ల కలిగే 3 సమస్యలు..

కండరాలను సాగదీయడం:
ప్రతి శరీరం దాని స్వంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనో లేదా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటే మాత్రం ప్రమాదమే. మీ సామర్థ్యం కంటే ఎక్కువగా నడవడం వల్ల కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. ఓవర్ వాకింగ్ కారణంగా చాలా మంది కండరాలు ఒత్తిడికి గురవుతారు. కండరాల ఒత్తిడి నడకలో ఇబ్బందిని కలిగిస్తుంది. తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. అంతే కాకుండా కండరాలకు జరిగే గాయాలు ప్రమాదం కూడా పెరుగుతుంది.


Also Read: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

మోకాళ్ల సమస్యలు :

మోకాలు, కీళ్ల సమస్యలు ఉన్నవారికి ఓవర్ వాకింగ్ సమస్యగా మారుతుంది. అతిగా నడవడం వల్ల మోకాళ్ల నొప్పులు పెరగవచ్చు. వృద్ధులు ముఖ్యంగా నడకకు దూరంగా ఉండాలి. లేదంటే వారి మోకాళ్ల సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

అలసట:

అతిగా నడవడం వల్ల శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గడానికి, చాలా మంది ప్రజలు అవసరానికి మించి నడవడం ప్రారంభిస్తారు. దీని వల్ల శరీరం అలసిపోవడం మొదలవుతుంది. అతిగా నడవడం వల్ల శరీరంపై అధిక చెమట పట్టి శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వేసవి కాలంలో ఓవర్ వాకింగ్ చేస్తే అది శరీరానికి మరింత హానిని కలిగిస్తుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×