E-Paper
Advertisement

Jr. NTR Devara: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక థియేటర్‌లో రచ్చరచ్చే!

Jr. NTR Devara: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక థియేటర్‌లో రచ్చరచ్చే!

Jr. NTR Devara Update: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలా అప్డేట్స్ రావడంతో ప్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే శరవేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ బిజీగా ఉన్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

దేవర సినిమాటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. ఈ సినిమాలో ఒక సాంగ్‌ను రాత్రి సమాయాల్లో షూట్ చేస్తున్నారు. దేవర సెట్స్ నుంచి రత్నవేలు తన ఫొటోను ఆదివారం ఉదయం షేర్ చేశారు. ‘ ఒక పాటను షూట్ చేస్తున్నాం. అనురుధ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక డ్యాన్స్‌లో యంగ్ టైగర్ స్టైల్, గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎందుకంటే ఈ పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు మామూలుగా ఉండవ్. థియేటర్స్‌ దద్దరిల్లిపోతాయి. ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.’ అని ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న రెండో మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుండగా..సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుండగా.. పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Also Read: ఐశ్వర్య..అభిషేక్ బచ్చన్ కాపురంలో చిచ్చుపెట్టింది అతడేనా?

ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే’ సాంగ్ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ దాదాపు 41 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×