
NTR : సైమా అవార్డుల వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ స్పీచ్ సంచలనం సృష్టిస్తోంది. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తారక్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను అభిమానులకు మాత్రమే తలవంచుతానని చెప్పాడు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చంద్రబాబును కలవక పోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సైమా అవార్డుల వేడకులో అభిమానుల గురించి ఎన్టీఆర్ చేసిన ప్రసంగం సంచలనం రేకెత్తిస్తోంది. తన ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారని తారక్ చెప్పారు. తాను కిందపడ్డ ప్రతిసారి అభిమానులు పైకి లేపారన్నారు. తన కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారని చెప్పారు. కానీ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మాత్రం స్పందించలేదు. దీనిని కొంత టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.
అభిమానుల గురించి మాట్లాడిన ఎన్టీఆర్ కు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడం తెలియదా..? అంటూ టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు. మరి ఆలస్యంగానైనా తారక్.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తారా? టీడీపీ శ్రేణుల ఆగ్రహాన్ని చల్లారుస్తారా?