BigTV English

Jr. NTR vs Manchu Vishnu: మంచు విష్ణు రికార్డునే బ్రేక్ చేయలేకపోయిన తారక్.. హవ్వా… పరువు మొత్తం పాయే.!

Jr. NTR vs Manchu Vishnu: మంచు విష్ణు రికార్డునే బ్రేక్ చేయలేకపోయిన తారక్.. హవ్వా… పరువు మొత్తం పాయే.!

Jr. NTR vs Manchu Vishnu:ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో.. ఎక్కువమంది ఆడియన్స్ త్వరగా చూడాలని ఆశ పడుతున్న సినిమాలలో మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప'(Kannaappa) మూవీ కూడా ఒకటి.ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల మధ్య, విమర్శల మధ్య ఎట్టకేలకు జూన్ 27న తన సినీమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు మంచు విష్ణు. రీసెంట్ గానే ఆయన యూఎస్ కి వెళ్లి అక్కడ కూడా రెండు, మూడు చోట్ల కన్నప్ప మూవీకి ప్రమోషన్స్ చేసుకున్నాడు. అయితే అలాంటి కన్నప్ప మూవీకి సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) నటించిన సినిమా ఇప్పుడు ట్రోల్స్ కి గురయ్యింది. అంతేకాదు మంచు విష్ణు సినిమా రికార్డుని కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఇది ఒక రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పరువు పోయే విషయమే అని చెప్పుకోవచ్చు.


మంచు విష్ణు రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ఎన్టీఆర్..

ఎందుకంటే ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ ముందు మంచు విష్ణు తేలిపోతారు. అలాంటిది ఎన్టీఆర్ నటించిన సినిమా మంచు విష్ణు నటించిన సినిమా ముందు తేలిపోవడం ఏంటని చాలామంది నందమూరి అభిమానులకి ఈ న్యూస్ నచ్చడం లేదు.ఇక అసలు విషయం ఏంటంటే..తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బాలీవుడ్ మూవీ వార్-2 నుంచీ టీజర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా వార్ -2 టీజర్ 24 అవర్స్ లో 1.30 మిలియన్ వ్యూస్,92.5k లైక్స్ వచ్చాయి. అయితే ఈ వార్ -2 టీజర్ మంచు విష్ణు కన్నప్ప మూవీ టీజర్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 4.9 మిలియన్ వ్యూస్ తో 183.7k లైక్స్ తో దూసుకుపోయింది. ఈ లెక్కన చూసుకుంటే మంచు విష్ణు కన్నప్ప మూవీ రికార్డ్ ని ఎన్టీఆర్ విలన్ పాత్ర లో నటించిన వార్ -2 మూవీ బ్రేక్ చేయలేకపోయింది.


ఎన్టీఆర్ పరువు తీస్తున్న యాంటీ ఫ్యాన్స్..

ముఖ్యంగా వార్ -2 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా..ప్రతినాయకుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించారు.. అలా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన వార్-2 మూవీ మంచు విష్ణు కన్నప్ప మూవీ రికార్డ్ ముందు తేలిపోయింది.. ఎన్టీఆర్ పరువు మొత్తం పోయింది అంటూ ఎన్టీఆర్ అంటే గిట్టనివాళ్ళు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు వార్-2 టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురయ్యారు జూనియర్ ఎన్టీఆర్.వార్-2 సినిమాలో హృతిక్ రోషన్ భారీ కటౌట్ ముందు ఎన్టీఆర్ అస్సలు మ్యాచ్ కాలేదని,ఆయన ప్లేస్ లో మరెవరైనా హైట్ ఉన్న హీరోని, ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోని ఎంచుకుంటే బాగుండేది అని ఎన్టీఆర్ హైట్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు హృతిక్ రోషన్ బాడీ ముందు ఎన్టీఆర్ ఏమాత్రం సెట్ కాలేదని కామెంట్లు చేసిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి అయితే హిందీ వాళ్ళు ఎన్టీఆర్ పరువు పోయేలా చూపించారని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

also read:HBD Mohan Lal: బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల కలెక్షన్లు… ఇప్పుడు మోహన్ లాల్ ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×