Fire Accident: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. ఎం జరుగుతుందో తెలిసేలోపే మంటలు వ్యాపించాయని చెప్తున్నారు ఉద్యోగులు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు అధికారులు.
Also Read: శెభాష్ పవన్ కల్యాణ్.. ఆపరేషన్ కుంకీ సక్సెస్..
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఆఫీస్‌లోని కంప్యూటర్లు, దస్త్రాలు కొన్ని కాలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల శాలరీలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. ఆన్‌లైన్ సిస్టం అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మినహా ఇతరులను లోపలికి అనుమతించలేదు. నిధి భవన్‌ను ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సిబ్భంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు మంత్రి. ఈ అగ్ని ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలయాల్సి ఉంది.