E-Paper
Advertisement

Apoorva Srinivasan: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న జ్యోతిలక్ష్మీ బ్యూటీ..

Apoorva Srinivasan: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న జ్యోతిలక్ష్మీ బ్యూటీ..
Advertisement

Apoorva Srinivasan marriage news(Tollywood news in telugu): ఒకప్పుడు సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఆ హంగామా అంతా ఇంతా కాదు. అభిమానులను సైతం పెళ్ళికి పిలిచి భోజనాలు పెట్టి పంపించేవారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు అలానే జరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎవరికి వారు గోప్యతను కోరుకుంటున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు పెళ్లి చేసుకున్నట్లు వాళ్లు చెప్తే తప్ప ప్రేక్షకులకు తెలియడం లేదు. ఈ మధ్యన తాప్సీ పెళ్లి కూడా అలానే జరిగింది. తన పెళ్లి అద్భుతంగా జరగాలని కోరుకున్నాను కానీ, ఆడంబరంగా కాదని, తాను కోరుకున్నట్లే ఎంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

Apoorva Srinivasan marriage news

Advertisement

ఇక ఈ జాబితాలో చేరింది మరో నటి అపూర్వ శ్రీనివాసన్. ఫైలెట్ అయిన ఆమె.. మోడలింగ్ కూడా చేస్తూ కొన్ని మంచి మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతిలక్ష్మీ చిత్రంలో హీరోను ప్రేమించి.. హీరో ఫ్రెండ్ ను పెళ్లి చేసుకొని అతడిని హింసించే గయ్యాళి పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత టెంపర్ లో గ్యాంగ్ రేప్ కు గురైన అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంది. ఇక  ఎక్కడికి పోతావు చిన్నవాడా, విన్నర్ ఇలాంటి సినిమాలో నటించి మెప్పించింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది. శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తితో ఆమె వివాహం ఎంతో సింపుల్ గా జరిగింది. ఇక ఈ పెళ్ళిలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేస్తూ.. అంతం లేని ప్రేమ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×