Big Stories

Mylavaram Assembly constituency: మైలవరం మొనగాడు ఎవరు?

- Advertisement -

లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 19న చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో మైలవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం.

- Advertisement -

పందెంకోళ్లు 1 సర్వే జరిగినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఉన్నారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయనకు 46 శాతం ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థిగా అప్పట్లో ప్రొజెక్ట్ అయిన దేవినేని ఉమకు 49 శాతం ఓట్లు వచ్చాయి.

Also Read: సపోర్టు ఓకే.. ప్రచారం మాటేంటి?

పందెంకోళ్లు 1 సర్వేకు, పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.

మైలవరం సెగ్మెంట్ లో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కు 46 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది. అయితే పందెంకోళ్లు 2 సర్వే జరిగే నాటికి మైలవరంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అభ్యర్థి తిరుపతి రావుకు 43 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చేసి టిక్కెట్ దక్కించుకున్నారు. సో ఆయనకు ఈ సర్వేలో 47 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఇతరులకు గత సర్వేలో 4 శాతం ఓట్లు, తాజా సర్వేలో 10 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

రెండు సర్వేల్లో మైలవరం సెగ్మెంట్ లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

15 శాతంగా ఉన్న కమ్మ కమ్యూనిటీ సపోర్ట్ పై ఆశలు

జనసేన, బీజేపీతో పొత్తులు కలిసి వచ్చే అవకాశాలు

వైసీపీ అభ్యర్థి ఏమేరకు పోటీ ఇస్తారన్న డౌట్లు

ప్రభుత్వంపై ఉన్న సహజ వ్యతిరేకపై టీడీపీ ఆశలు

మైలవరంలో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు

బీసీ అభ్యర్థికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడంతో సమీకరణాలు మారే ఛాన్స్

ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News