BigTV English

HYD IT Corridor Six accidents: వీడు మామూలోడు కాదు.. మిడ్ నైట్లో ఏకంగా గంటలో ఆరు..!

HYD IT Corridor Six accidents: వీడు మామూలోడు కాదు.. మిడ్ నైట్లో ఏకంగా గంటలో ఆరు..!

HYD IT Corridor Six accidents: అమాయకంగా కనిపిస్తున్న ఈ చక్రవర్తి మామూలోడు కాదు. మందు వేశాడంటే చాలు శివతాండమే చేస్తాడు. ఎవరి మాట వినడు.. తాను అనుకున్న పని క్షణాల్లో అయిపోవాల నుకుంటాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఏకంగా ఆరు రోడ్డు యాక్సిడెంట్లు చేశాడు. ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో జరిగింది. మొత్తానికి ఇతగాడ్ని బంధించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. అసలేం జరిగింది.


ఇంకా లోతుల్లోకి వెళ్తే.. పేరు క్రాంతి‌కుమార్.. వయసు మూడుపదులు.. ఉండేది నిజాంపేట. రాత్రి వేళ ఫుల్‌గా తాగేసి ఆ మత్తులో కారు ఎక్కాడు. హైదరాబాద్ ఐటీ కారిడాల్‌లో బీభత్స సృష్టించాడు. గంట వ్యవధిలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చేశాడు. ముఖ్యంగా ఐకియా నుంచి రాయదుర్గం పోలీసుస్టేషన్ వరకు మొత్తం ఆరు యాక్సిడెంట్లు చేశాడు.

ఐకియా దగ్గర మొదలైన క్రాంతికుమార్ జర్నీ.. తొలుత ఆగి ఉన్న కారుని ఢీకొట్టాడు. అందులో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. కారు ఆపకుండా గచ్చిబౌలి వైపు వెళ్తున్న లైన్‌లో మరో బైక్‌ని ఢీ కొట్టాడు. బైక్ రైడర్‌కి కాలు విరిగింది. అటువైపు మీదుగా పిస్తా హౌస్ దగ్గర మరో యాక్సిడెంట్ చేశాడు. అక్కడ ఎవరికీ గాయపడలేదు. తర్వాత వరసగా మూడు యాక్సిడెంట్లు చేశారు. చివరకు ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.


ALSO READ: సీతమ్మకు బంగారు పట్టుచీర.. ప్రత్యేక ఆకర్షణగా సీతారాముల ప్రతిమలు

క్రాంతికుమార్ ర్యాష్‌గా డ్రైవ్ చేయడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు అతడ్ని వెంటాడారు. చివరకు మల్కంచెరువు వద్ద క్రాంతి వాహనాన్ని అడ్డుకుని దేహశుద్ది చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు . నిందితుడికి బ్రీత్ అనలైజర్ టెస్టులో ఏకంగా 550 రీడింగ్ వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Tags

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×