BigTV English

Suriya: నా రక్తం మీ రక్తం వేరు వేరా..స్టేజిపైన కన్నీళ్లు పెట్టుకున్న సూర్య

Suriya: నా రక్తం మీ రక్తం వేరు వేరా..స్టేజిపైన కన్నీళ్లు పెట్టుకున్న సూర్య

Suriya: అభిమానం అంటే తెలుగు ప్రేక్షకులు..  తెలుగు ప్రేక్షకులు అంటేనే అభిమానం. ఒక హీరోను మన అనుకున్నారు అంటే.. అతను ఏ భాష, ఏ కులం, ఏ మతం లాంటివేమీ చూడకుండా గుండెల్లో పెట్టుకుంటారు.  ఎన్నేళ్ళైనా ఆ అభిమానం వారి గుండెల్లో అలాగే ఉండిపోతుంది. అందుకే ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా .. తెలుగు ఇండస్ట్రీపైనే  సెలబ్రిటీలు అందరూ ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరోల్లో  తమిళ్ స్టార్ హీరో సూర్య ఒకడు.


గజినీ సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకుంటూనే వస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సూర్య సంపాదించుకోవడానికి మరో ముఖ్యమైన కారణం.. ఆయన వ్యక్తిత్వం, ఆ కుటుంబం యొక్క మంచితనం. మొన్నటికి మొన్న కార్తీ విషయంలో ఏదైతే వివాదం జరిగిందో.. దాన్నీ వివాదంగా చూడకుండా .. తమ తప్పేనేమో అని అనుకోని కార్తీ, పవన్ కళ్యాణ్ కు సారీ  చెప్పడం.. సూర్య సైతం తమ్ముడుకు సపోర్ట్ గా నిలబడడం వారి మంచితనాన్ని నిరూపించాయి.

దీపావళీ రేసులో దిగుతున్న 9 సినిమాలు ఇవే..


ఇక ఫ్యాన్స్ తో సూర్య ప్రవర్తించే తీరు.. చిన్నపిల్లలను చదివించే గొప్ప మనసు.. ఇవన్నీ ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి. ఇంకా చెప్పాలంటే.. సూర్య పుట్టినరోజును తమిళియన్స్ ఎంత గ్రాండ్ గా చేస్తారో.. అంతకుమించి గ్రాండ్ గా టాలీవుడ్ ఫ్యాన్స్ చేస్తారు. అంతటి ఆదరణను సూర్య అందుకున్నాడు. విజయాపజయాలు పట్టించుకోకుండా సూర్య ఏ సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం సూర్య నటించిన చిత్రం కంగువ. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ వేడుకలో సూర్య ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఒక టాలీవుడ్ స్టార్ హీరో కనుక  ప్రెస్ మీట్ కు వస్తే ఏ రేంజ్ లో అరుస్తారో.. అలాగే సూర్య వచ్చినప్పుడు ఫ్యాన్స్ అరిచి గోల గోల చేశారు. ఇక ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ ప్రేమకు సూర్య మంత్రముగ్దుడు అయ్యాడు. తెలుగువారి ప్రేమకు దాసోహమని స్టేజిపైనే కళ్లనీళ్లు  పెట్టుకున్నాడు. కంగువ సినిమాలోని నా రక్తం మీ రక్తం వేరు వేరా అనే డైలాగ్ తో స్పీచ్ మొదలుపెట్టాడు.

Jani Master: షాకింగ్.. అందరికీ థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసిన జానీ మాస్టర్

” అందరికీ నమస్కారం. ఈ స్టేజిపై  నేను నిలబడడం అంతా నేను చేసుకున్న అదృష్టం.  నేను బాలయ్యగారు అన్ స్టాపబుల్ షో నుంచి వస్తున్నాను. ఇంత అభిమానం నాపై చూపిస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలాంటి ప్రేమ నాపై మీరు చూపించడం నేను ఆ దేవుడు ఇచ్చి ఆశీర్వాదంగా అనుకుంటున్నాను. రెండేళ్లు నేను వెండితెరపై కనిపించకపోయినా .. నా పాత సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ అయ్యినప్పుడు థియేటర్ లో మీరు చూపించిన ప్రేమకు నాకు కన్నీళ్లు ఆగలేదు. మీకు, నాకు మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. ఒక రక్త సంబంధం.

మీకు మంచి అద్భుతమైన  సినిమా   ఇవ్వడం నా బాధ్యత. అదే కంగువ ద్వారా మీకు కనపడుతుంది. రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. శివ కే మొత్తం క్రెడిట్ ఇస్తాను. ఈ సినిమా నవంబర్ 14 న మిమ్మల్ని కొత్త ప్రపంచానికి  తీసుకెళ్తుంది. ఒక స్నేహితుడికి అండగా  నిలిచిన యోధుడి కథ కంగువ. మీరే నాకు యోధులు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని కోసం నిలబడండి. అందులో గెలవండి. మీకు మీరు గర్వపడేలా చేయండి. త్వరలోనే మీ అందరిని నేను కలుస్తాను. నాకు మీ ప్రేమ కావాలి. మీ ఆశీస్సులు కావాలి” అని ముగించాడు. ప్రస్తుతం సూర్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×