BigTV English

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా బుల్లితెరకు పరిచయమయ్యాడు సుధీర్ ఆనంద్. కంటెస్టెంట్ గా  వేణు వండర్స్ టీమ్ లో కామెడీ పండించి.. ఆ తరువాత సుడిగాలి సుధీర్ పేరుతో టీమ్ లీడర్ గా మారాడు. ఇక తన కామెడీ, స్టైల్, డ్యాన్స్  లతో  ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా యాంకర్ గా మారి.. అన్ని ఛానెల్స్ లో మనోడే కనిపించేవాడు. ఇక ఆ గుర్తింపుతో  హీరోగా మారాడు. గాలోడు, కాలింగ్ సహస్త్ర లాంటి  సినిమాల్లో నటించి మెప్పించాడు.


ఇక సుధీర్ మూడో సినిమా గోట్ మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత  చేతులు ఎత్తేయడం.. డైరెక్టర్ సైలెంట్  గా తప్పుకోవడంతో .. గోట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సినిమా మధ్యలో ఆగిపోవడంతో సుధీర్ మళ్లీ యాంకర్ గా మారాడు. ఆహాలో  సర్కార్ సీజన్ 4 తో రీఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ప్రస్తుతం ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో  చేస్తున్నాడు. ప్రతి వారం సీరియల్ ఆర్టిస్టులను పిలిచి వారితో ఆడించి, డ్యాన్స్ లు వేయించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు.

Suriya: నా రక్తం మీ రక్తం వేరు వేరా..స్టేజిపైన కన్నీళ్లు పెట్టుకున్న సూర్య


తాజాగా ఫ్యామిలీ స్టార్స్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం ఈ షోకి ఈటీవీ లో ప్రసారం అవుతున్న రంగుల రాట్నం, రాధా మనోహరం సీరియల్ ఆర్టిస్టులు సందడి చేశారు. ఇక సుధీర్.. అమ్మాయిలతో పులిహోర కలపడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఒక హీరోయిన్ తో సుధీర్ పులిహోర కలపడానికి ట్రై చేస్తుంటే.. వెనుక నుంచి షో మేకర్స్.. పులిహోర కలపడం ఎలా అనే వాయిస్  ను ప్లే చేశారు. దీంతో సుధీర్ హార్ట్ అయ్యాడు. ఆ ప్రశ్న అడగమన్నది మీరే.. ఆ తరువాత పులిహోర కలుపుతున్నాడు అని మ్యూజిక్ వేసింది మీరే.. ఇంత బ్యాడ్ చేయాలనీ చూస్తున్నారురా మీరు అంటూ  చెప్పుకొచ్చాడు.

సుధీర్ సరదాగా అన్నా కూడా అందులో నిజం లేకపోలేదు. కెమెరా ముందు ఉండే సుధీర్ వేరు.. కెమెరా  వెనుక ఉండే సుధీర్ వేరు. ఇంత పులిహోర, అమ్మాయిలతో సుధీర్ రాసలీలలు.. ఇవన్నీ నిజం కాదు. కేవలం షో కోసం, కామెడీ కోసం మాత్రమే చేసినవి. అందులో రష్మీ లవ్ ట్రాక్ కూడా ఒకటి. కెమెరా ముందు మాత్రం వారిద్దరూ లొవర్స్ కానీ, బయట సుధీర్- రష్మీ కేవలం స్నేహితులు మాత్రమే. ఈ విషయాన్ని వారు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

Jani Master: షాకింగ్.. అందరికీ థాంక్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసిన జానీ మాస్టర్

ఇక బయట కూడా సుధీర్ ఆడవారితో చాలా గౌరవంగా  మెలుగుతాడట.  కామెడీని పండించడానికి మాత్రమే తనను తాను బ్యాడ్ గా  చెప్పించుకుంటున్నాడు అని ఎంతోమంది అతడి గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి  సుధీర్ యాంకర్ గా కొనసాగుతాడా.. ? హీరోగా మళ్లీ ఎంట్రీ ఇస్తాడా.. ? అనేది కాలమే నిర్ణయించాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×