E-Paper
Advertisement

Kajal Aggarwal: సౌత్‌ ఇండస్ట్రీలో ఉన్న విలువలు అక్కడ లేవు.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్..

Kajal Aggarwal: సౌత్‌ ఇండస్ట్రీలో ఉన్న విలువలు అక్కడ లేవు.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్..
Advertisement

Kajal Aggarwal: ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. కొంతకాలంగా దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలు సౌత్ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి.

ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో నైతికత లోపించిందని చెప్పుకొచ్చింది. ‘‘నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ.. నా కెరీర్ స్టార్ట్ అయిందంతా హైదరాబాద్‌లోనే. బాలీవుడ్ సినిమాలకంటే తమిళం, తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించాను. హైదరాబాద్, చెన్నై నగరాలనే నా పుట్టినిల్లుగా భావిస్తాను.

Advertisement

దక్షిణాది ఇండస్ట్రీలో మంచి, స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే అక్కడ ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కంటెంట్ వస్తుంటుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. దక్షిణాది సినిమాల్లో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్ లోపించింది’’ అని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

ప్రస్తుతం కాజల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ ఫ్యాన్స్‌ కాజల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×