BigTV English

Kajal Aggarwal on Strange Incident: ఎవరు లేని సమయంలో అతడు వచ్చి షర్ట్ విప్పి.. దాన్ని చూపించాడు..!

Kajal Aggarwal on Strange Incident: ఎవరు లేని సమయంలో అతడు వచ్చి షర్ట్ విప్పి.. దాన్ని చూపించాడు..!

Actress Kajal Aggarwal Shared Strange Incident with Fan: సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత అందంగా ఉంటుందో.. దాని వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పడే కష్టాలు అంతా ఇంతాకాదు. ఎప్పుడు ఎవరు వచ్చి తాకుతారో తెలియదు. అభిమానం పేరుతో మీద మీద పడిపోయి తాకారని చోట తాకుతూ ఉంటారు. ఇవన్నీ భరిస్తూ స్టార్స్ గా కొనసాగడం అంటే మాములు విషయం కాదు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాన్ కెరీర్ లో కూడా ఇలాంటి సంఘటనలు చూసినట్లు చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం కాజల్.. సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశికిరణ్ తిక్కా సమర్పించడం విశేషం. ఈ సినిమాలో కాజల్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 7 న సత్యభామ రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన కాజల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.

Also Read: Satyabhama Release Date: కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్


తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. “కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాను. మొదటి రోజు షూటింగ్ పూర్తయ్యింది. నేను రెస్ట్ తీసుకుందామని క్యార్ వ్యాన్ లోకి వెళ్లి కూర్చున్నాను. అంతలోనే నా అనుమతి లేకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ లోపలి వచ్చాడు. వెంటనే షర్ట్ విప్పి పక్కన పడేశాడు. నేను ఆ ఊహించని ఘటనకు షాక్ అయ్యాను. అతను తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని చెప్తూ.. చూడమని కోరాడు. అతని చేసిన పనికి నేను భయపడిపోయాను. అభిమానం ఉండాలి కానీ, ఇలా చేయడం మంచిది కాదని తిట్టి పంపించాను” అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి సత్యభామతో కాజల్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×