BigTV English

Kalki2898AD: పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నారు మావా.. ఆ ఐకానిక్ షాట్స్ నెక్ట్స్ లెవెల్ అంతే

Kalki2898AD: పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నారు మావా.. ఆ ఐకానిక్ షాట్స్ నెక్ట్స్ లెవెల్ అంతే

Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త రికార్డ్ ను సృష్టించాడు. కల్కి2898AD.. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రభాస్ ఇలా వెయ్యికోట్ల క్లబ్ లో చేరడం ఇది నాలుగోసారి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి జూన్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.


మైథలాజికల్ కథకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి నాగీ చేసిన ప్రయోగం వర్క్ అవుట్ అవ్వడమే కాదు రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక కల్కిలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించగా.. అశ్వత్థామగా అమితాబ్ కనిపించాడు. ఇక కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా కొద్దిసేపు కనిపించినా హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమా చూడడానికి యువత ఎప్పుడు చదవని మహాభారతాన్ని చదువుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఇప్పటికీ కల్కి.. అన్ని థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాపై మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. రోజుకో కొత్త పోస్టర్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. సినిమాలోని ఐకానిక్ షాట్స్ ను ఎచ్ డి లో వదులుతున్నారు. తాజాగా రూ. 1000 కోట్ల పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. మూడు ఐకానిక్ షాట్స్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


ముఖ్యంగా అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న కర్ణ పోస్టర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఇక దీంతో పాటు భూకంపం పుట్టిస్తాను అంటూ క్లైమాక్స్ లో విష్ణు మూర్తిలా అవతారమెత్తిన సుప్రీం యాస్కిన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. వీటితో పాటు అశ్వత్థామ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృస్టిస్తుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×