BigTV English

DMart Q1 Results: లాభాల్లో దూసుకెళ్తున్న డీమార్ట్.. భారీగా పెరిగిన అమ్మకాలు

DMart Q1 Results: లాభాల్లో దూసుకెళ్తున్న డీమార్ట్.. భారీగా పెరిగిన అమ్మకాలు

DMart Q1 Results: డీమార్ట్ పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్కెట్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. తొలి త్రైమాసికంలోనే రూ. 773.8 కోట్ల నికర లాభాన్ని డీమార్ట్ నమోదు చేసింది. గతేడాది లాభం రూ. 659 కోట్లతో పోలిస్తే 17.8 శాతం వృద్ధి నమోదైంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ ఆదాయం సైతం 18.6 శాతం వృద్ధితో రూ. 14,069 కోట్లుగా నమోదైంది.


డీమార్ట్ లాభాలు సమీక్షా త్రైమాసికంలో ఎబిటా 18 శాతం పెరిగి రూ. 1221.3 కోట్లుగా నమోదవగా.. గతేడాది ఇది  రూ. 1035.3 కోట్లుగా ఉంది. కంపెనీ మార్జిన్ 8.68 శాతంగా ఉండగా ఇదే త్రైమాసికంలో డీమార్ట్ కొత్తగా మరికొన్ని స్టోర్లు తెరిచింది. దీంతో జూన్ చివరి నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 371కి చేరుకుంది. త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో అవెన్యూ సూపర్ మార్ట్స్ షేరు 1.15 శాతం లాభంతో రూ. 4953 వద్ద ముగిసింది.

జనరల్ మర్చండైజ్ అపారెల్ సెయింట్స్ మెరుగు పడటంతోనే లాభాలు గడించినట్లు ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. జూన్ 30 నాటికి కొత్తగా ఆరు స్టోర్లు ప్రారంభించింది డీమార్ట్. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్‌ల సంఖ్య 371 చేరుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ పరిధిలో డిమార్ట్ రిటైల్ బిజినెస్ నిర్వహిస్తోంది. రోజువారీ తక్కువ కాస్ట్ రోజువారి ధర వ్యూహాన్ని అనుసరిస్తోంది. డీమార్ట్ పోటీ ధరలకు వస్తువులను సేకరించడం పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ధరలను నిర్ణయిస్తోంది.


Also Read:ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి.. లేదంటే జీవితంలో ఏం జరుగుతుంది!

డీమార్ట్ వినియోగదారుల డబ్బుకు విలువలను అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. కంపెనీ తన సేవల స్థాయిలను మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తు కోసం సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంపై నిరంతర ప్రయత్నం చేస్తోంది. అయితే డీమార్ట్ తమ ఖర్చులు కూడా పెరిగినట్లు పేర్కొంది. ఈ కంపెనీ ఈ కామర్స్ వ్యాపారంపై కూడా ఎక్కువగా దృష్టి సారించింది. గురుగ్రాంలో ఈ కామర్స్ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.

Tags

Related News

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

EPFO New Rule: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే.. EPFO కొత్త మార్గదర్శకాలివే!

Jio Recharge Plans: మిస్ అయ్యానే.. జియోలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయా!

iPhone 17 Air: వావ్ ఎంత స్మూత్‌గా ఉంది.. iPhone 17 Air సూపరబ్బా.

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Big Stories

×