E-Paper
Advertisement

Kalki 2898 AD: చిన్నారులకు ‘కల్కి’ మేకర్స్ బంపరాఫర్‌.. అదిరిపోయింది.. డోంట్ మిస్..

Kalki 2898 AD: చిన్నారులకు ‘కల్కి’ మేకర్స్ బంపరాఫర్‌.. అదిరిపోయింది.. డోంట్ మిస్..
Advertisement

Kalki 2898 AD: దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ‘కల్కి 2898 ఏడీ’. విజువల్ వండర్‌తో మ్యాజిక్ చేశాడు. హాలీవుడ్‌ను మించిన గ్రాఫిక్స్‌తో థియేటర్లకు పరుగులు పెట్టించాడు. అతడి క్రియేటివిటీకి సినీ ప్రియులు మంత్రముగ్దులైపోయారు. అంతేకాకుండా ఇందులోని యాక్షన్ సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరకెక్కిన తీరు అందరిచేత ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవాలి.

అందులోనూ యాక్షన్‌కి మరింత కామెడీ జోడించి నవ్వులు పూయించాడు. మొత్తంగా వివిధ భాషల ఇండస్ట్రీ నుంచి స్టార్లను దించి సినిమా రేంజ్‌నే మార్చేశాడు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ.. కోలీవుడ్ నుంచి కమల్ హాసన్.. మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటీ నటులు ఇందులో నటించి అదరగొట్టేశారు అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో అదే రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేస్తుంది.

Advertisement

ఈ సినిమాకి పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడంతో మరిన్ని కలెక్షన్లతో అదరగొట్టేస్తుంది. ఇప్పటికీ దాదాపు రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి ఇప్పుడు రూ.1100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. త్వరలో ఈ మార్క్‌ను చేరుతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత అలాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది.

Also Read: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా కల్కి మూవీ మేకర్స్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిన్నారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. కల్కి సినిమా కోసం వేసిన భారీ సెట్‌ను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇందుకోసం ఓ చిన్న పని చేయాలని మేకర్స్ అన్నారు. మీ పిల్లలు కల్కి సెట్ చూడాలంటే.. ముందుగా మీ పిల్లలో కల్కి సినిమా గురించి మాట్లాడించి ఆ వీడియోను తమకు పంపించాలని కోరారు. అలా వచ్చిన వీడియోల్లో ది బెస్ట్ ఏది అనిపిస్తే ఆ పిల్లలకు కల్కి సెట్ చూసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దంటూ చెప్తున్నారు.

ఈ మేరకు కల్కి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ‘‘చిన్నపిల్లలకు కల్కి మూవీ సెట్స్‌ను చూపించాలనుకుంటే.. మీ చిన్నారితో కల్కి సినిమా గురించి మాట్లాడిస్తున్న వీడియో మాకు పంపండి. కల్కి సెట్స్‌ను చూసే అవకాశాన్ని పొందండి. మీరు పంపించే వీడియోలకు #ILoveKalki అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేయండి’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో కల్కిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×