BigTV English

Shami open On Sania marriage Rumours: సానియామీర్జాతో పెళ్లిపై నోరు విప్పిన క్రికెటర్ ష‌మీ

Shami open On Sania marriage Rumours: సానియామీర్జాతో పెళ్లిపై నోరు విప్పిన క్రికెటర్ ష‌మీ

Shami open On Sania marriage: టీమిండియా జట్టులోకి మహమ్మద్ షమి ఎప్పుడు వస్తాడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ముమ్మరం గా ప్రాక్టీసు చేస్తున్నారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌‌తో జరిగే సిరీస్‌కు షమి అందుబాటులోకి రావచ్చని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇదిలావుండగా తాజాగా టెన్నిస్ స్టార్ సానియామీర్జాతో మ్యారేజ్ రూమర్లపై నోరు విప్పాడు షమి.


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాక్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ 14 ఏళ్ల బంధానికి ఇటీవలే తెర పడిం ది. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ గాసిప్ బయటకువచ్చింది. త్వరలో షమి-సానియామీర్జా ఒకటి కానున్న ట్లు జోరుగా వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సానియామీర్జాతో పెళ్లి రూమర్లపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాలు వెల్లడించారు క్రికెటర్ మహమ్మద్ షమి. మ్యారేజ్ రూమర్లను తోసిపుచ్చాడు. సోష‌ల్‌మీడియాలో న‌కిలీ వార్త‌లు వ్యాపి చేయ‌డాన్ని ప్ర‌జ‌లు మానుకోవాల‌ని సూచన చేశాడు. మీమ్స్ వ‌ల్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంద‌ని కానీ.. వాటి వ‌ల్ల హాని కూడా జ‌రుగుతుంద‌న్నాడు.


సరదా కోసం వీటిని చేస్తున్నారో, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తనకు తెలీదన్నాడు షమి. ఫోన్ ఓపెన్ చేస్తే ఆ మీమ్స్‌లు కనిపిస్తున్నాయని, వినోదం కోసం మాత్రమే వాటిని చేసినట్టుగా భావిస్తున్నానని మనసులోనిమాట బయట పెట్టాడు. ఇలాంటి పుకార్లు వ్యాపించేవారు వెరిఫై పేజీ నుంచి అడిగితే తాను జవాబు చెబుతానని అన్నాడు.

ALSO READ: పాక్ జర్నలిస్టుపై హర్బజన్‌సింగ్ ఆగ్రహం, ధోనితో రిజ్వాన్‌‌ పొలిక‌పై

సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికాడు షమి. మొత్తానికి షమి వైపు క్లారిటీ రావడంతో మ్యారేజ్ రూమర్ల కు దాదాపుగా బ్రేక్ పడిందనే చెప్పవచ్చు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×