E-Paper
Advertisement

Kalki 2898 AD: ప్రభాస్ ‘క‌ల్కి’ నుంచి ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

Kalki 2898 AD: ప్రభాస్ ‘క‌ల్కి’ నుంచి ‘టా టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Advertisement

Kalki 2898 Ad Taka Takkara Full Video Song Released: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తుంది. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో మూడవ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా తొలి రోజు వరుస సినిమాలతో రూ.100 కోట్లు క్రాస్ చేసిన 5వ సినిమా ఇదే కావడం గమనార్హం.

ఇక ఫస్ట్ డే భారీ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా రెండో రోజుకు కాస్త డీలా అయింది. రెండ్రోజుల్లో కేవలం రూ.298.5 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది. మరి వీకెండ్ రావడంతో మరింత కలెక్షన్లు మెరుగుపడతాయని అంతా అనుకున్నారు. కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఉండటంతో సినిమాకి గట్టి దెబ్బ పడింది. నైట్‌ షోలకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇక ఇవాళ సండే కావడంతో వసూళ్లు పుంజుకుంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

 Also Read: ‘కల్కి 2’ రిలీజ్‌పై నిర్మాత అశ్వినీదత్ క్రేజీ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..!

ఏది ఏమైనా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కి సినీ ప్రియులు, అభిమానులు సెల్యూట్ కొడుతున్నారు. ఇలాంటి విజువల్ వండర్‌ను ఇంత వరకు హాలీవుడ్‌లో మాత్రమే చూశామని.. టాలీవుడ్ అలాంటి సినిమాను తెరకెక్కిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కొందరు సెలెబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి ఒక సినిమా టాలీవుడ్ నుంచి వస్తుందని ఎవరూ ఊహించరు. హాలీవుడ్ నుంచి ఇలాంటి సినిమాలు వస్తే ఎగిరిగంతేసే సినీ ప్రియులకు దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి.

Advertisement

ఈ సినిమాపై పలువురు స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని వారి అభిప్రాయల్ని తెలిపారు. మొత్తంగా అందరి మన్ననలు అందుకుంటున్న ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంత మేర కలెక్షన్లను నమోదు చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుండగానే మేకర్స్ తాజాగా ఈ మూవీలోని ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. టక టక్కర్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను వదిలారు. ప్రస్తుతం ఆ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×