BigTV English
Advertisement

Warren Buffett Another $5.3 Billion To Charity: వారెన్ బఫెట్ కొత్త నిర్ణయం, వీలునామాలో సవరణ..

Warren Buffett Another $5.3 Billion To Charity: వారెన్ బఫెట్ కొత్త నిర్ణయం, వీలునామాలో సవరణ..

Warren Buffett Another $5.3 Billion To Charity: ప్రపంచంలో కుబేరుల్లో ఒకరు బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్ వారెన్ బఫెట్. ఆస్తి వీలునామా గురించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం ఆస్తిని తన ముగ్గురు పిల్లలు, కొత్తగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌కే చెందుతుందని ప్రకటించారు.


ప్రపంచ ధనవంతుల్లో వారెన్ బఫెట్ గురించి తెలియనివారు ఈ జనరేషన్‌లో ఉండరు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతుంది. మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్నా ఇప్పటికీ చాలా మంది ఆయన అనుసరించిన విధానాలనే ఫాలో అవుతారు. అంతేకాదు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటారు.

అమెరికాలోని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు 93 ఏళ్ల బిజినెస్‌మేన్ వారెన్ బఫెట్. అందులో తన వీలునామా గురించి కీలక విషయాలు వెల్లడించారు. తన మరణానంతరం మొత్తం ఆస్తి ముగ్గురు పిల్లలు కొత్తగా నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కే చెందుతుందని ప్రకటించారు. గతంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలుగా ఇవ్వనున్నట్లు రాసిన వీలునామాను మరోసారి సవరించు కున్నారు.


తన పిల్లలు సముచితంగా సంపదను పంపిణీ చేస్తారనే విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారెన్ బఫెట్ వెల్లడించారు. అయితే తాను బతికున్నంతకాలం గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్‌కు విరాళాలు అందిస్తానని స్పష్టంచేశారు. గతంలో తన మరణం తర్వాత సంపదలో 99శాతం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు చెందుతుందన్నారు. తాజాగా వారెన్ బఫెట్ పిల్లలకు ముగ్గురికీ ఛారిటబుల్ ట్రస్టులున్నాయి. తన కంపెనీలోని 13 మిలియన్లు షేర్లను పిల్లల ట్రస్టులకు రాశారాయన.

ALSO READ: టైమ్ ఓవర్,అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేతకు ఎలాన్ మస్క్‌

మొత్తం నాలుగు స్వచ్చంధ సంస్థలను నిర్వహిస్తున్నారాయన. సుసాన్ థాంప్సన్ బఫెట్, షేర్ వుడ్ , హోవార్డ్ జి. బఫెట్, నోవో ఫౌండేషన్ అనే పేర్లతో వీటిని నిర్వహిస్తున్నారు బఫెట్. సుమారు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 9.3 మిలియన్ల షేర్లను కేటాయించినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. మొత్తానికి బఫెట్ మనసు మార్చుకుని పిల్లలతోపాటు సొంత ఛారిటబుల్ ట్రస్టులకే తొలి ప్రయార్టీ ఇచ్చారు.

Tags

Related News

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Big Stories

×