E-Paper
Advertisement

Kalki 2898 AD: ‘కల్కి 2898ఏడీ’ అప్డేట్.. ప్రభాస్, దిశాపటానీపై సాంగ్‌షూట్.. ఫొటో చూశారా?

Kalki 2898 AD: ‘కల్కి 2898ఏడీ’ అప్డేట్.. ప్రభాస్, దిశాపటానీపై సాంగ్‌షూట్.. ఫొటో చూశారా?
Advertisement
Kalki 2898 AD
Kalki 2898 AD

Prabhas Kalki 2898 AD update (Telugu Cinema News): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ మూవీతో రికార్డుల వర్షం కురిపించిన ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో మరికొన్ని రికార్డులను సృష్టించాలనుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్‌లో ప్రభాస్ హాలీవుడ్ హీరోలా కనిపించడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయింది.

Advertisement

సైన్స్, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ మరో షెడ్యూల్‌ను జరుపుకుంది. ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను ప్రభాస్, దిశా పటానీలపై చిత్రీకరించారు. అందుకు సంబంధించి షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్, దిశా ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

Also Read: మరో మూడు భాషల్లో హనుమాన్‌.. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?

Advertisement

ఆ ఫొటోలో ప్రభాస్ చిన్న స్మైల్‌తో స్టైలిష్ కళ్లజోడు పెట్టి ఉన్నాడు. అలాగే దిశా పటానీ క్యూట్‌గా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ పియులు, అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా ఇటీవలే ప్రభాస్, దిశాపై ఓ సాంగ్‌ను షూట్ చేయడానికి చిత్రబృందం ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బీచ్ లోకేషన్లలో వీరిద్దరిపై ఓ సాంగ్‌ను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి.

 

ఇదిలా ఉంటే ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీతో సహా మరికొంత మంది స్టార్ నటీ నటులు ఈ మూవీలో భాగం అయ్యారు. ఇకపోతే అన్ని పులు పూర్తి చేసుకుని ఈ మూవీ మే 9న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×