E-Paper
Advertisement

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు..!

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు..!
Advertisement
Kalki 2898 AD update
Kalki 2898 AD

Prabhas Kalki 2898 AD(Latest news in Tollywood): ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సైన్స్ ఫిక్సన్, పురాణాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఫుల్ హైప్ ఉంది. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో వార్త బయటకొచ్చి సినీ ప్రియుల్ని, అభిమానుల్ని నిరాశపరిచింది. అదేంటనే విషయానికొస్తే.. ఇది వరకే ఈ మూవీని మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Advertisement

అనివార్య కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ ఇప్పుడు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా కొత్త రిలీజ్ డేట్‌ కూడా వచ్చేసిందని చెబుతున్నారు. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు మే 30కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మే 30న రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

Also Read: ‘కల్కి 2898ఏడీ’ అప్డేట్.. ప్రభాస్, దిశాపటానీపై సాంగ్‌షూట్.. ఫొటో చూశారా?

Advertisement

ఈ అప్డేట్‌తో సినీ అభిమానులు డీలా పడిపోయారు. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇకపోతే ఈ మూవీలో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించి ఫుల్ సర్ప్రైజ్ అందించాడు. ఫుల్ హెయిర్, గడ్డంతో బాడీ నిండా సేఫ్టీ జాకెట్‌తో కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్‌తో మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో పెద్దగా చెప్పాల్సి పనేలేదు. కాగా ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటానీ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఎక్కడా క్వాలిటీ మిస్ కాకుండా చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×