E-Paper
Advertisement

Kalki 2898 AD: ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి’ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kalki 2898 AD: ఓటీటీలోకి ప్రభాస్ ‘కల్కి’ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Kalki 2898 AD Movie OTT update(Latest telugu movies): గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,100కోట్లకుపైగా వసూళ్లు చేసింది. థియేటర్స్‌లో చూడని వారు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ఓ వార్త వచ్చింది.

తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ ఆగస్టు 23నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే అసలు రన్ టైమ్ లో దాదాపు 6 నిమిషాల ఫుటేజీ కట్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

సినిమా విషయానికొస్తే..అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భైరవగా రెబల్ ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఇద్దరి మధ్య పోటాపోటీగా ఫైట్ ఎఫెక్ట్‌గా తీశారు. ఇందులో ఇద్దరూ మెప్పించారు. ఇక, క్లైమాక్స్‌లో సినిమా ఓ రేంజ్‌లో ఉండడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. చివరిలో వచ్చే సీన్స్ చూసిన ప్రేక్షకులు థియేటర్స్‌లో రచ్చ రచ్చ చేశారు.

ఈ సినిమాలో సుప్రీమ్ యస్మిన్ పాత్రలో కమల్ హాసన్ యాక్టింగ్ అదిరిపోయింది. ఆయనతోపాటు ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం, దుల్కర్ సల్మాన్ పశుపతి కీలక పాత్రలు పోషించారు. ఇంకా అక్కడక్కడ విజయ్ దేవరకొండ కనిపించడంతో ఫ్యాన్స్ విజిల్స్ వేయడం మామూలుగా ఉండదు.

Advertisement

Also Read: విడుదలకు ముందే చిక్కుల్లో కంగువ, తంగలాన్ సినిమాలు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు..

ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ లవర్ బాయ్‌గా వస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×