Allu Arjun latest news(Tollywood news in telugu): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ మీద జరిగే ట్రోలింగ్ పక్కనపెడితే ఇండస్ట్రీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చూపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా చిన్న సినిమాలకు బన్నీ అండగా నిలబడడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది.
తాజాగా అల్లు అర్జున్.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ సినిమాకు సపోర్ట్ గా నిలబడ్డాడు. నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆయ్. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహిస్తుండగా GA2 ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పూర్తిగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్స్ ఆయ్ కోసం రంగంలోకి దిగారు.
తాజాగా అల్లు అర్జున్ సైతం ఆయ్ సినిమాకు బెస్ట్ విషెస్ తెలిపాడు. “గీతా ఆర్ట్స్ లో భాగమైన నా ప్రియమైన స్నేహితుడు బన్నీవాసు మరియు సిస్టర్ విద్యా కొప్పినీడు కు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ ఆయ్ మూవీ నా హృదయానికి చాలా దగ్గరైన వారికి అఖండ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Huge thanks to our ICON stAAr 🌟 @alluarjun garu for your best wishes for the #AAYMovie team❤️🙏
Your incredible words and immense support mean the world to us🔥🤩#AAY #AAYonAUG15#AlluAravind @TheBunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan @GA2Official #AnjiKManiputhra… pic.twitter.com/r7HfeESr7u
— GA2 Pictures (@GA2Official) August 13, 2024