BigTV English

Kalki 2898 AD Update: కల్కి 2898 AD క్రేజీ అప్డేట్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

Kalki 2898 AD Update: కల్కి 2898 AD క్రేజీ అప్డేట్, ఫ్యాన్స్‌కి పూనకాలే..

prabhas latest movie kalki 2898 latest update


Kalki 2898 AD Trailer Crazy Update: యంగ్‌ రెబల్ స్టార్‌ డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గానే ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డం తెచ్చి పెట్టిన మూవీ బాహుబలి. ఈ మూవీతో ప్రభాస్‌కి నేషనల్ వైడ్‌గానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్‌ని సంపాదించి పెట్టింది. తాజాగా..నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ కల్కి 2898 AD మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు. 2024 మే 9న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సన్నద్దం కాబోతున్నారు.

ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ మూవీని వైజయంతి నిర్మాణంలో నిర్మాత అశ్వినిదత్ రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌టో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌తో కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్‌లో, బాహుబలిని మించి ఉండబోతోందని అటు ప్రభాస్ ఫ్యాన్స్‌, ఇటు ఆడియెన్స్‌ అంతా భావిస్తున్నారు.


ఇక ఈ మూవీలో లోకనాయకుడు కమల్‌హాసన్‌, నటి దీపికా పదుకోన్‌, దిశాపటాని, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, హీరో రానా, నటుడు రాజేంద్రప్రసాద్ వంటి పలువురు స్టార్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు.మరికొంతమంది స్టార్స్‌ కూడా ఈ మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్‌ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక కల్కి మూవీ మహాభారతం బ్యాక్‌ డ్రాప్‌తో స్టార్ట్ అయి 2898వ సంవత్సరంలో ముగుస్తుందని, 6000 సంవత్సరాల మధ్య జరిగే స్టోరీ అని ఇటీవల మూవీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ ఈవెంట్‌లో చెప్పి ఈ మూవీపై మరింత బజ్‌ని క్రియేట్ చేశాడనే చెప్పాలి.

తాజాగా.. ఈ మూవీ యూనిట్ టీం కల్కి మూవీకి సంబంధించిన ట్రైలర్‌ అప్డేట్ ఇచ్చింది. కల్కి మూవీ ట్రైలర్ ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌గా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ మే 9న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Read More: భర్తని అన్‌ఫాలో చేయడంపై నయనతార ఫ్యాన్స్ కంగారు, రీజన్ అదేనా అంటూ..

చూడాలి మరి.. గతంలో కొన్ని మూవీస్‌తో డీలా పడిన ప్రభాస్, ఈ మూవీతో ఏ మేరకు ఆడియెన్స్‌ని అలరిస్తాడనేది మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ తప్పదు. ఏదేమైనా ఈ మూవీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంది. ఇందులో ప్రభాస్ ఏ విధమైన లుక్‌లో కనిపించనున్నాడో అని ఆడియెన్స్‌ తెగ తొందరపడుతున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ తెగ ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు ఈ మూవీ ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×