BigTV English

Chandrababu: హు కిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ ఇప్పటికైనా చెప్పాలి..

Chandrababu: హు కిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ ఇప్పటికైనా చెప్పాలి..

Chandrababu


Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా గురజాడ నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదిలిరా’ నరసరావు పేట ఎంపీ లావు శ్రీ కృష్ణాదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో తల పెట్టిన వాటర్ గ్రీడ్, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్దికి తమ వెంట నడవాలని చంద్రబాబు కోరారు.

కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలన్నారు. హు కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. బాబాయ్ ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు ఆడగాలన్నారు. హత్యలు చేసేవారు రాజకీయాలక పనికిరారన్నారు.


ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని జగన్ చెల్లే చెప్పిందన్నారు. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా..? టిష్యూ పేపర్ లా వాడుకుంటారన్నారు. జగన్ ది యూజ్ అండ్ త్రో విధానమన్నారు. మరో వైపు 40 రోజుల్లో జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్దంగా ఉన్నారన్నారు. బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైరాబాద్ తాడేపల్లిలో జగన్కు ప్యాలెస్ లు ఉన్నాయన్నారు. అవన్ని సరిపోక రుషికొండలో మరో ప్యాలెస్ కడుతున్నారని విమర్శించారు.

Read More: మాజీమంత్రిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారని చంద్రబాబు అన్నారు. పవన్, తనది ఒక్కటే ఆలోచన.. మాలో విభేదాలు సృష్టించలేరన్నారు. అప్పులు చేయడం తెలిసిన పార్టీ వైసీపీ.. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలి పెట్టేది లేదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచి వేశామన్నారు.

పల్నాడు జిల్లాలో 30 మంది తెలుగు తమ్ముళ్లను పొట్టన పెట్టుకున్నారన్నారు. కోడెలను వేధించి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపారని పేర్కొన్నారు. పలు గ్రామాల ప్రజలు ఊర్లు వదిలిపోయారన్నారు. అభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి చిరునామా వైసీపీ అన్నారు. ఏ తప్పూ చేయని ప్రత్తిపాటి శరత్ ను అరెస్టు చేశారు.. జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలని ప్రశ్నించారు. బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు. పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీని మడిచి ఊరికి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

 

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×