Nayantara fans are worried about unfollowing her husband: మూవీ ఇండస్ట్రీలలో హీరోహీరోయిన్లు, డైరెక్టర్లు, హీరోయిన్లు ఇలా ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. ఈ కోవలోకి చాలామంది నటీనటులు వచ్చి చేరారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. వారి పెళ్లిళ్లు ఎంతో కాలం నిలబడటం లేదు. మనస్పర్ధల కారణంగా కొందరు, డేటింగ్ చేసి మరికొందరు ఇలా విడిపోయినవారున్నారు. అంతేకాదు తమ భాగస్వామి నచ్చకపోతే ఒకరినొకరు అన్‌ఫాలో చేస్తున్నారు. అయితే తాజాగా లవ్ మ్యారేజీ చేసుకున్న ఓ జంట అదే కోవలోకి వచ్చినట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ జంట నయనతార, విగ్నేష్ శివన్‌లకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తన పెళ్లి ప్రస్తావన దగ్గర నుండి అనేక చిక్కుల్లో పడిన సంగతి మనందరికి తెలిసిందే. కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరు సరోగసి ద్వారా ఈ జంట కవల పిల్లలని కన్నారు. క్యూట్ కపూల్ అంటే ఇలా ఉండాలనే విధంగా ఫోటోలు దిగుతూ సోషల్‌మీడియాలో రచ్చ చేస్తుంటారు. కానీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు గత కొంతకాలంగా తెగ స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. వీరి తెలియపరచడం కోసం అంతలా ఫోటోలకు పోజులివ్వాలా అంటూ నెటిజన్లు గతంలో వీరి జంటపై ఫైర్ అయ్యారు.
Read More: రామ్ చరణ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాల్సిందే భయ్యా..
కానీ.. తాజాగా నయన్ విగ్నేష్ విడిపోతారా అనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నయనతార తన ఇన్‌స్టా స్టోరీలో.. ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభించదని ఎప్పటికి తన బాధని వ్యక్తపరిచేలా ఇంగ్లీష్ పదాలతో ఓ కొటేషన్ పెట్టింది. అంతేకాదు తన భర్త విగ్నేష్‌ని అన్‌ఫాలో చేసింది. దీంతో దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అయితే కొసమెరుపు ఏంటంటే నయన్ అన్‌ఫాలో చేసినా సరే.. విగ్నేష్ మాత్రం ఇంకా ఫాలో చేస్తున్నాడు. అంతేకాదు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా అలాగే ఉండిపోయాయి. దీంతో వీరిద్దరు విడిపోతున్నారా లేక అనుకోకుండా ఏదైనా టెక్నికల్ సమస్య మూలంగా నయన్ విగ్నేష్‌ని అన్‌ఫాలో చేసి ఉంటుందా అనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా అస్సలు వీరిద్దరు విడిపోయే ఛాన్స్ లేదని చాలామంది నెటిజన్లు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.