BigTV English

Nag Ashwin Dance Video: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఊర మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!

Nag Ashwin Dance Video: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఊర మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!

Director Nag Ashwin Dance on His Birthday Celebrations in ‘Kalki 2898AD’ Sets: సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ అని అంటారు. ఒక సినిమా హిట్ అయితే హీరోను అంటారు. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ను అంటారు. కథ సరిగ్గా చెప్పలేదు .. సరిగ్గా తీయలేదు ఇలాంటి మాటలు ప్రేక్షకులనుంచి వినకూడదు అని.. సినిమా షూటింగ్ పూర్తీ అయ్యేవరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు డైరెక్టర్. ఇక వారికి ఫ్యామిలీ, పార్టీ లు అన్ని సినిమానే.. అది మంచిగా వచ్చింది అంటే చాలు అంతకుమించిన వేరే పార్టీనే అవసరం లేదు. ఇక అప్పుడప్పుడు మాత్రమే స్టార్ డైరెక్టర్స్ ఛిల్ల్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య రాజమౌళి తన భార్యతో కలిసి ఫంక్షన్ లో డ్యాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే.


తాజాగా మరో స్టార్ డైరెక్టర్ సైతం తన బర్త్ డే పార్టీలో మాస్ డ్యాన్స్ వేసి ఔరా అనిపించాడు. అతనే డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి సినిమాతో తన సత్తా చూపించిన నాగీ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న కల్కి 2898AD సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్, దీపికా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక నిన్న నాగీ పుట్టినరోజు కావడంతో కల్కి సెట్ లోనే పెద్ద పార్టీ నిర్వహించారు. ఇక ఈ పార్టీలో నాగీ డ్యాన్స్ అదరకొట్టేశాడు. నాగార్జున మాస్ సినిమాలోని అన్న నిల్చుంటే మాస్.. అనే సాంగ్ కు దుమ్మురేపాడు.

Also Read: Koratala Shiva: కృష్ణమ్మ కోసం వచ్చినా.. ఆచార్యను వదలరేమో కొరటాల.. ?


ఇక ఇది కాకుండా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలోని ఓ పిల్లా నీ పేరు లవ్లీ సాంగ్ కు భార్యతో కలిసి చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సూపర్ నాగీ మావా.. డ్యాన్స్ అదరగొట్టేశావ్ అని కొందరు.. కల్కి అవుట్ ఫుట్ బాగా వచ్చిన ఆనందం కళ్లలో కనిపిస్తుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×