Big Stories

Rahul Gandhi: దేశాన్ని విభజిస్తామంటూ మోదీ తప్పుడు ఆరోపణ.. రాహుల్ గాంధీ క్లారిటీ

Rahul Gandhi: సంపద సర్వే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ‘సామాజిక-ఆర్థిక సర్వే’ చేపడతామని ప్రకటించింది. అయితే దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసి అందరికీ సమానంగా పంపిణీ చేస్తామని చెబుతోందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగగా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.

- Advertisement -

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అదే ఈ హామీపై దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్దు దుమారమే చెలరేగింది. ఈ హమీ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజలందరి దగ్గర ఉన్న బంగారం సహా.. సంపదను సర్వే చేసి అందరికీ సమానంగా పంపిణీ చేయబోతోందంటూ ప్రధాని మోదీ విమర్శించారు.

- Advertisement -

మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన పార్టీ సామాజిక సమ్మేళన కార్యక్రమంలో తమ హామీపై క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వే అనంతరం తాము చర్యలు తీసుకుంటామని చెప్పలేదని.. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడానికి సర్వే చేస్తామన్నారు. తాము ప్రజలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే.. మోదీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

తాము చేపట్టబోయే ఆ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడ ఉందో అందరికీ అర్థం అవుతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. కానీ, తాము మంచి చేయడానికి చూస్తుంటే.. కాంగ్రెస్ దేశాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ తమపై బురద జల్లేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం దేశభక్తులం అని చెప్పుకునేవారు.. తాము చేపడతామన్న సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణనకు భయపడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read: Priyanka attack on Modi: నాటకాలు ఆపు, మంగళసూత్రం విలువ మోదీకి ఏం తెలుసు

కాంగ్రెస్ చేపట్టబోయే కులగణను ఏ శక్తి ఆపలేదని, వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి నిర్ణయం దీనిపైనే ఉంటుందని మరోసారి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో అన్యాయానికి గురైన 90 శాతం మందికి న్యాయం చేయడమే తమ జీవిత లక్ష్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News